పాల క్యాన్ లో మద్యం బాటిల్స్..ఎలా దొరికిపోయాడంటే?

Update: 2020-04-07 11:10 GMT
దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. ఈ కరోనా ను ఎలా కట్టడిలోకి తీసుకు రావాలో తెలియక ..ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ మర్కజ్ ఘటన బయటపడిన తరువాత దేశ వ్యాప్తంగా చాలా కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.దీంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. నిత్యవసర వస్తువులు మినహా వేటిని అనుమతించడం లేదు. అయితే, నిత్యావసర సరుకుల ముసుగులో కొంతమంది తప్పుడు పనులు చేస్తున్నారు.

తాజాగా ఢిల్లీ లో జరిగిన ఒక ఘటన బయటపడింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కు సమీపంలో పోలీసులు అనేక చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు.  నిత్యవరస వస్తువులను సరఫరా చేసే వాహనాల్ని తప్ప , మిగిలిన ఏ వాహనాల్ని కూడా అనుమతించడం లేదు.  దీంతో అయితే - ఓ వ్యక్తి పాల క్యాన్ లో మద్యం బాటిల్స్ పెట్టుకొని వెళ్తూ పోలీసులకు దొరికిపోయాడు. తనిఖీ చేసే సమయంలో అతని ప్రవర్తన కొంచెం విచిత్రంగా ఉండటం తో అనుమానం వచ్చిన పోలీసులు అతడిని చెక్ చేయగా దొరికిపోయాడు. 

అసలు ఈ వ్యవహారం ఎలా బయట పడింది అంటే ..చెక్ పోస్టు వద్ద డ్యూటీ చేస్తున్న  పోలీసులకు టీ తాగాలని అనిపించింది.  అదే సమయంలో అటుగా పాల క్యాన్ తో వస్తున్న బైక్ ను ఆపారు.  కానీ, అతను బైక్ ఆపకుండా ముందుకు వెళ్లడం తో అనుమానం వచ్చిన పోలీసులు - ఆ బైక్ ను వెంబడించి పట్టుకున్నారు. ఆ తరువాత  పాల క్యాన్ ఓపెన్ చేసి చూస్తే  ఆ క్యాన్ లో పాలుకి బదులు .మద్యం బాటిల్స్ ఉండటాన్ని చూసి.. పోలీసులు షాక్ అయ్యారు. లాక్ డౌన్ ఉల్లంఘన చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు.
Tags:    

Similar News