మందు దొరక్క తాగుబోతులు ఏం చేస్తున్నారంటే..

Update: 2020-04-02 01:30 GMT
కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా లాక్ డౌన్ విధించడం.. అందులో భాగంగా మద్యం దుకాణాలు మూసేయడం తో మందుబాబులు అల్లాడిపోతున్నారు. దీంతో మద్యం కొరతను ఆసరాగా తీసుకుని కొందరు నాటు సారా తయారీ మొదలుపెట్టారని వినిపిస్తోంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో ఈ సమస్య పెరిగినట్లు తెలుస్తోంది.

తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలంలోని కొన్ని గ్రామాల్లో చెరకు తోటల్లో రహస్యంగా నాటు తయారీ బట్టిలు ఏర్పాటు చేశారని చెబుతున్నారు. డిమాండును బట్టి లీటరు రూ. 50 నుంచి రూ. 200కి విక్రయిస్తున్నారట.

లాక్ డౌన్ కారణంగా పనులు లేకపోవడం తో మందుబాబులు నాటు సారా కేంద్రాల స్థావరాల వద్ద కల్తీ మద్యం సేవించి అనారోగ్యానికి గురవుతున్నారని మహిళలు మండిపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల నాటు సారా తయారీపై ఫిర్యాదులు వచ్చాయి.

కొందరు నాయకులు, వారి అనుచరులు సైతం ఈ నాటు వ్యాపారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ఆరోపనలు వస్తున్నాయి. నాయకుల ఇన్వాల్వ్‌మెంట్ ఉన్న కారణంగానే పోలీసులు, ఎక్సయిజ్ అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారని చెబుతున్నారు.
ఇది ఇలాగే వదిలేస్తే లాక్ డౌన్ తరువాత కూడా నాటు సారా తయారీ ఆగదని.. దానివల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం రావడమే కాకుండా ప్రజల ప్రాణాలకు కూడా ముప్పు తప్పదని అంటున్నారు.
Tags:    

Similar News