ప్రత్యర్దులు సిద్దం..విజయం తథ్యం

Update: 2018-11-19 10:21 GMT
తెలంగాణ ముందస్తు ఎన్నికలలో కీలక ఘట్టానికి తెర పడింది. కాంగ్రెస్ - తెలుగుదేశం - సీపీఐ పార్టీలు మహాకూటమిగా ఏర్పాడిన అనంతరం అసలు యుద్దం ఊపందుకుంది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితిని గద్దె దించేందుకు మహాకూటమి హైదారబాద్‌ లోని పలు హోటల్స్‌ లో పలు చర్చలు - దేశ రాజధాని హస్తినలో వార్‌ రూమ్ భేటీలు జ‌రిపింది. అసంత్రుప్తులను ఎక్కువ మందిని పోగు చేసుకుని మహాకూటమిలోని పార్టీలు తమ అభ్యర్దులను ఎట్టకేల‌కు ప్రకటించాయి. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ప్రత్య‌ర్దులెవరో తేలిపోయింది. ఇక కారు విజయమే మిగిలి ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణలో మొత్తం119 స్దానాలు ఉండగా వాటిలో 105 స్దానాలను అధికార తెలంగాణ రాష్ట్ర సమితి రెండు నెలల క్రితమే ప్రకటించింది. అధికార పక్షానికి ప్రత్యర్దులైన మహాకూటమి అభ్యర్దులు నామినేషన్ చివరి రోజు వరకు అంచెలంచెలుగా అభ్యర్దులను ప్రకటించారు. ఇది ఒక విధంగా తెలంగాణ రాష్ట్ర సమితికి - ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు నైతిక విజయమేనని - విశ్లేషకుల అభిప్రాయం. తెలంగాణ రాష్ట్ర సమితిలో అక్కడక్కడ అసంత్రుప్తులుంటే - మహాకూటమిలో దాదాపు అన్నీ అసంత్రుప్తితో ప్రకటించినవే కావడం గమనార్హం.

సోమవారం సాయంత్రంతో నామినేషన్ల దాఖ‌లు సమయం ముగుస్తుంది. అయినా ఇంకా మహాకూటమిలో స్పష్టత రాకపోవడం టిఆర్‌ ఎస్‌ కు అనుకూలించే అంశం. తెరాస అభ్యర్దులు తమ తమ నియోజకవర్గాలలో ఇప్పటికే రెండు - మూడు విడతల ప్రచారాన్ని ముగించారు. ఇన్నాళ్లు ఏం చేసిందో ఇక ముందు - ఏం చేయనుందో తమ ప్రచారంలో ప్రకటిస్తున్నారు. ఇన్నాళ్లుగా ప్రత్యర్దులు ఎవరో తేలకపోవడంతో వారి గురించి - ఆ పార్టీల గురించి చెప్పే అవకాశం తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్దులకు రాలేదు. ఇప్పుడు మహాకూటమి అభ్యర్దులు కూడా వెల్లడవడంతో తెరాస అభ్యర్దులు తమ ప్రచార గురిని ప్రత్యర్దులవైపు మళ్లించనున్నారు. ఇన్నాళ్లు ప్రజలకు దూరంగా ఉన్నారని వ్యక్తిగత వ్యవహారాలు తప్ప ప్రజల గురించి ప్రతిపక్షాలు పట్టించుకోలేదు అనే విమర్శలను సంధించనున్నారు. ఇక ఇతర పార్టీల నుంచి ప్రతిపక్ష పార్టిలో చేరిన ప్యారచూట్ నాయకులకు టిక్కట్టు ఇచ్చారని - ఇలా జంపింగ్ జంపంగ్‌ లు ప్రజలకు ఎలాంటి మేలు చేస్తారని అధికారం పార్టీకి చెందిన అభ్యర్దులు తమ అస్త్రాలను సంధించనున్నారు. మిత్రమా సమయం లేదు...విజయమే మిగిలింది అంటూ టిఆర్‌ ఎస్ శ్రేణులు ఎన్నికల యుద్దంలో తలపడనున్నారు.
Tags:    

Similar News