దేశ నూతన సైన్యాధ్యక్షుని గా జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే డిసెంబర్ 31న బాధ్యతలను స్వీకరించిన విషయం తెలిసిందే. మనోజ్ తో పాటు తన ఇద్దరు స్నేహితులు సైతం దేశ భద్రత అంశం లో కీలక హోదాలో ఉన్నారు. ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ నరవణే తో పాటు, నావల్ స్టాఫ్ ఏడీసీ చీఫ్ గా అడ్మిరల్ కరంబీర్ సింగ్, ఎయిర్ చీఫ్ మార్షల్గా రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియాలు భారత రక్షణా వ్యవస్థలో పనిచేస్తున్నారు.
ఎన్డీఏ లో బ్యాచ్ మెట్ గా కొనసాగిన ఈ ముగ్గురు స్నేహితులు దేశానికి సేవలందించడం లో ఒకరి తో ఒకరు పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురు 1976లో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరారు. త్రివిధ దళాల్లో అంచలంచెలుగా ఎదుగుతూ 44సంవత్సరాల తరువాత అడ్మిరల్ కరంబీర్ సింగ్ గతేడాది మే31న నేవి చీఫ్ గా, భదౌరియా సెప్టెంబర్ 30న ఎయిర్ చీఫ్ మార్షల్ గా, డిసెంబర్ 31న నరవణే ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించి ప్రశంసలందుకున్నారు.
ఈ ముగ్గురు ఎన్డీఏ లో మూడేళ్ళు కోర్స్ ను పూర్తి చేసి 1980 జూన్-జూలై లో అధికారులుగా నియమించబడ్డారు. అంతకంటే ముందుగా వివిధ విభాగాల ఉన్నతాధికారులగా గుర్తింపు పొందారు. అయితే ఒకే బ్యాచ్ కు చెందిన ఈ ముగ్గురు ఆర్మీ, నేవి, ఎయిర్ ఫోర్స్ లో ఇలాంటి అరుదైన అర్హత సాధించడం చాలా కష్టమని ఓ ఆర్మీ అధికారి తెలిపారు. పుట్టిన తేదీ, శిక్షణ, మెరిట్, సీనియారిటీల ఆధారంగా పదోన్నతలు కల్పిస్తారని, కానీ ఈ ముగ్గురు ఘనత సాధించడం గొప్ప విషయమని సదరు అధికారి ప్రశంసల వర్షం కురిపించారు.
నరవణే, కరంబీర్ సింగ్, రాకేశ్కుమార్ సింగ్ లు ఎలా తమ బ్యాచ్ లో కీర్తి గడించారో ..1991 డిసెంబర్‌లో జరిగిన ఎన్‌డిఎ 81 వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఇలాంటి దృశ్యమే చోటు చేసుకుంది. అప్పటి స్నేహితులైన జనరల్ ఎస్ఎఫ్ రోడ్రిక్స్, అడ్మిరల్ ఎల్ రామ్‌దాస్, ఎసిఎం ఎన్‌సి సూరిలు అవుట్ పరేడ్ లో అతిథులుగా పాల్గొన్నారు. అదే పాసింగ్ అవుట్ పరేడ్ లో లెఫ్టినెంట్ జనరల్ నరవణే, ఎసిఎం భదౌరియా ఎన్ డిఎలోని “లిమా” స్క్వాడ్రన్ లో ఉండగా, అడ్మిరల్ కరంబీర్ సింగ్ “హంటర్” స్క్వాడ్రన్‌లో ప్రాతినిధ్యం వహించారు.
కాగా దేశంలో ఉన్న 1.3మిలియన్ ఆర్మీ సిబ్బంది నూతన సైన్యాధ్యక్షునిగా ఎంపికైన జనరల్ మనోజ్ ముకుంద్ నార్వానే నాయకత్వం వహిస్తున్నారు. ఇప్పటిదాకా ఈ హోదాలో కొనసాగిన బిపిన్ రావత్ ను కేంద్ర ప్రభుత్వం ప్రమోషన్ కల్పించింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా నియమించింది. ఆయన వైదొలగడం వల్ల ఖాళీ అయిన ఆర్మీ చీఫ్ స్థానాన్ని మనోజ్ ముకుంద్ నరవణే భర్తీ చేశారు.