ఏపీలో కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ రికార్డ్ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అలాగే ప్రతిరోజూ కరోనా మృతుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇదిలా ఉంటే .. కొందరు కరోనా మృతదేహాల వద్ద కూడా తమ చేతివాటం చూపిస్తున్నారు. శవాలని కూడా చూడకుండా దోచేస్తున్నారు. తాజాగా తిరుపతి స్విమ్స్ శ్రీపద్మావతి స్టేట్ కరోనా కేర్ ఆసుపత్రిలో కరోనాబారిన పడి మృతిచెందిన వ్యక్తి నుంచి బంగారు ఉంగరంతో పాటు ఖరీదైన మొబైల్ మాయం కావడం విమర్శలకు తావిచ్చింది.
గత కొన్ని రోజులుగా స్విమ్స్ కరోనా ఆసుపత్రిలో మృతదేహాలపై బంగారు ఆభరణాలు మాయం అవుతుండటంతో సర్వత్రా విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. ఈ సమయంలోనే చౌడేపల్లెకు చెందిన వెంకటరత్నంనాయుడు పదిరోజుల క్రితం మృతి చెందాడు. ఈ మృతదేహం చేతికి ఉన్న బంగారు ఉంగరంతో పాటు ఖరీదైన మొబైల్ ను పీపీకిట్లతో విధుల్లో వున్న ఓ వ్యక్తి తీసుకుంటుండటం గురువారం సీసీ పుటేజీ లో స్పష్టంగా కనిపించింది. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే , కరోనా డెడ్ బాడీస్ పై బంగారు ఆభరణాలు మాయం వ్యవహారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వరకు వెళ్లింది. ఈ ఘటనపై ఆయన సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంపై మంత్రి నాని తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ తో ఫోన్‌లో మాట్లాడి , ఈ చర్యకి పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.