జగన్ పై హత్యాయత్నం.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్

Update: 2018-12-03 10:37 GMT
వైఎస్ జగన్ పై ఇటీవల విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసులో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నెల రోజుల క్రితం విశాఖపట్నం ఎయిర్ పోర్టులో కత్తితో దాడి జరిగిన సంగతి తెలిసిందే.. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఈ అంశంపై హైకోర్టులో పిటీషన్ కూడా దాఖలైంది. కేసును ఏపీ పోలీసులు నీరుగారుస్తున్నారని.. వాస్తవాలు దాచేస్తున్నారని.. వెంటనే కేసును ఎన్ ఐఏకు బదిలీ చేయాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా  రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

విచారణకు స్వీకరించిన కోర్టు విశాఖ విమానాశ్రయంలో జగన్ పై దాడి జరిగితే ఏపీ పోలీసులు ఎందుకు విచారణ జరుపుతున్నారని సోమవారం  హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ ఐఏకు అప్పగించాలని.. ఈ మేరకు ఎందుకు బదిలీ చేయలేదో కోరుతూ కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఎల్లుండి 5వ తేదికి వాయిదా వేసింది.

అంతకు ముందు విచారణ సందర్భంగా హైకోర్టు... ఏపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసును తక్షణం ఎన్ ఐఏకు అప్పగించకపోవడంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. ఆళ్ల తరుఫున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదిస్తూ.. సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసుకున్న ఏపీ ప్రభుత్వం కావాలనే విచారణను తమ పరిధిలో ఉంచుకొని విన్నవించారు. ఎన్ ఐఏన్  యాక్ట్ సెక్షన్ 6 ప్రకారం ఎయిర్ పోర్టు లేదా ఎయిర్ క్రాఫ్ట్ లో ఏదైనా జరిగితే విచారణ ఎన్ ఐఏ పరిధిలోకి వస్తుందని తెలిపారు. ఆళ్ల తరుఫు న్యాయవాది వాదనతో ఏకీభవించిన కోర్టు ఏపీ ప్రభుత్వానికి తాజాగా నోటీసులు జారీ చేసింది..
    

Tags:    

Similar News