ఏపీ విపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబుకు మంగళగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాజాగా వార్నింగ్ ఇచ్చేశారు. తప్పులు చేసిన బాబు అధికారం చేజారిన తర్వాత కూడా తన తీరును మార్చుకోని నేపథ్యంలో ఆళ్ల కటువైన మాట చెప్పక తప్పని పరిస్థితి. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఇంట్లో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఐదేళ్లు ఉండటం బాబుకు మాత్రమే చెల్లుతుందేమో?
నిబంధనలకు సీఎమ్మే స్వయంగా పాతరేసినప్పుడు.. రాష్ట్రంలో అవినీతి అక్రమాలు ఎంత దారుణంగా ఉంటాయన్న విషయం బాబు జమానాలో చూసిందే. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి జగన్.. కొత్త తరహా పాలన అంటే ఎలా ఉండాలో చేతల్లో చేసి చూపిస్తున్నారు. కోట్లాది రూపాయిలు ఖర్చు పెట్టి నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయటం ద్వారా రాష్ట్రంలోని అక్రమ నిర్మాణదారులకు గట్టి సందేశాన్ని జగన్ పంపారని చెప్పాలి.
తానేం చేయనున్నది స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా బాబు తన తీరును మార్చుకోవటాన్ని తప్పు పడుతున్నారు. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి బాబుపై ఫైర్ అయ్యారు. ప్రజావేదిక పక్కనున్న భవనంలో బాబు ఉండటాన్ని తప్పు పట్టిన ఆయన.. తక్షణమే ఆయన ఇల్లు ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు.
తానైతే బాబును వదిలిపెట్టనంటూ సంచలన వ్యాఖ్య చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఇంట్లో బాబు ఎలా ఉంటారని ప్రశ్నించిన ఆళ్ల.. కరకట్ట మీద అరవైకి పైగా ఖరీదైన భవనాలు ఉన్నాయని.. వాటన్నింటిని స్వచ్ఛందంగా ఖాళీ చేయాలన్నారు.
జగన్ కున్న మంచి మనసును అందరూ గుర్తించాలన్న ఆళ్ల.. ప్రజావేదిక తర్వాత తాము కూల్చేసి చంద్రబాబు అద్దె ఇంటినే అని చెప్పారు. కరకట్టమీద ఉన్న అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇప్పించామన్నారు. ఈ నెల 21న ఈ కేసులు న్యాయస్థానం ముందుకు రావాల్సి ఉన్నా.. వాటిని రాకుండా చంద్రబాబు మేనేజ్ చేశారన్నారు. ప్రజావేదిక కూల్చివేత తర్వాతైనా తక్షణమే ఖాళీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆళ్ల వ్యాఖ్యలు చూస్తుంటే.. బాబు త్వరగా తట్టాబుట్టా తీసుకొని బయటకు వెళ్లాల్సిన అవసరం ఉన్నట్లు కనిపించక మానదు.