ముస్లిం మహిళలకు గుడ్ న్యూస్ : అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

Update: 2022-04-19 08:30 GMT
ముస్లిం మహిళలకు అలహాబాద్ హైకోర్టు గుడ్ న్యూస్ తెలిపింది. భరణం విషయంలో వారికి అనుకూల తీర్పు రావడంతో ముస్లిం మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓ కేసు విషయంలో వీరికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  విడాకులు తీసుకున్న మహిళలు కూడా ప్రొసిజర్ ప్రకారం భరణం పొందవచ్చని తెలిపింది. అలాగే ఇద్దత్ కాలం తరువాత కూడా పొందవచ్చని పేర్కొంది. సెషన్ కోర్టు నిర్ణయాన్ని పక్కనబెట్టిన ధర్మాసం .. ముస్లిం మహిళలకు కూడా విడాకుల తరువాత భరణం పొందేందుకు అర్హులని నిర్ణయించారు.

2008లో దాఖలైన రజియా క్రిమినల్ రివిజన్ పిటిషన్ పై అలహాబాద్ హైకోర్టు తాజాగా విచారణ చేపట్టింది. అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ కు చెందిన జస్టిస్ కరుణేశ్ సింగ్ పవార్ తో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. అప్పటి సెషన్ కోర్టు ఇచ్చిన ఆదేశాలు సవాల్ చేస్తూ వేసిన రివిజన్ పై విచారణ జరిపి ఫైనల్ గా ఆదేశాలు జారీ చేశారు.

వీరి తీర్పు ప్రకారం విడాకులు తీసుకున్న ముస్లిం  మహిళలు క్రిమినల్ ప్రొసిజర్ కోడ్ సెక్షన్ 125 ప్రకారం భర్త నుండి భరణం పొందే హక్కు ఉందన్నారు. విడాకులు తీసుకున్న మహిళలు మరో పెళ్లి చేసుకునేవరకు ఈ హక్కు ఉంటుందని ఆదేశాలు జారీ చేశారు.

ముస్లిం మహిలల చట్టం ప్రవేశపెట్టిన తరువాత పిటిషనర్, ఆమె భర్త కేసు ఈ చట్టానికి లోబడి ఉండాలి. సెషన్స్ కోర్టు పేర్కొన్న చట్టంలోని సెక్షన్ 3, 4 ప్రకారం విడాకులు తీసుకున్న ముస్లిం మహిళకు మాత్రమే భరణం లభిస్తుంది.  

ఇక షబానా బానో కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు తరువాత ముస్లిం మహిళలు విడాకులు తీసుకున్న తదుపరి ఇద్దత్ కాలం తరువాత కూడా సెక్షన్ 125 ప్రకారం భరణం పొందేందుకు అర్హులని పేర్కొన్నారు. అమె మరో వివాహం చేసుకుంటే మాత్రం ఈ ఆదేశాలు వర్తించనవి హైకోర్టు స్పష్టం చేసింది.

ముస్లిం మహిళలు విడాకులు తీసుకున్న తరువాత ఇద్దత్ కాలం వరకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఇద్దత్ అంటే భర్త మరణించిన లేదా విడాకులు తీసుకున్న తరువాత ఆయనకు దూరంగా ఉండడాన్ని ఇద్దత్ అంటారు. ఇద్దత్ వ్యవధి మూడు రకాలుగా ఉంటుంది. వృద్ధ మహిళ నాలుగు నెలల 10 రోజులలో.. యువతి మూడు నెలల రుతుక్రమం.. సమయంలో మరొక పురుషుడి ఎదుటకు రాకుండా ఉండాలి. ఇక గర్భణీ స్ట్రీ ఒక బిడ్డకు జన్మనిచ్చిన తరువాత ఇద్దత్ కాలం ముగుస్తుంది.
Tags:    

Similar News