న్యాయస్థాన తీర్పులలో మరో కీలక పరిణామం. సామూహిక అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తికి బెయిల్ మంజూరు చేసిన ఘటనలో న్యాయమూర్తిని విధుల నుంచి తాత్కాలికంగా తొలగించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. మాజీ మంత్రి - సమాజ్ వాదీ పార్టీ నేత గాయత్రి ప్రజాపతి సామూహిక అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ చేస్తున్న ప్రత్యేక కోర్టు ఆయనకు బెయిల్ ను మంజూరు చేసింది.
అయితే ఈ విషయాన్ని సవాలు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ప్రజాపతికి మంజూరైన బెయిల్ ను రద్దు చేసింది. అలాగే ప్రత్యేక కోర్టు జడ్జీని విధులను నుంచి తాత్కాలికంగా పక్కనబెట్టింది. శాఖాపరమైన దర్యాప్తునకు సైతం ఆదేశించింది. హైకోర్టు నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.
యూపీ సీఎంగా అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం ఉన్నపుడు మంత్రిగా ఉన్న ప్రజాపతి అక్టోబర్ 2014 నుంచి జూలై 2016 వరకు వరుసగా ఓ మహిళపై లైంగిక దాడులకు పాల్పడుతూ వచ్చాడు. అనంతరం ఆమె కుతూరిని కూడా లైంగికంగా వేధించాలని యత్నించాడు. ఇక తాళలేక ఆ మహిళ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ డీజీపీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంగానీ, ఇతర ఎటువంటి చర్యలు తీసుకోని కారణంగా బాధిత మహిళ సుప్రీంకోర్టు గడప తొక్కింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో యూపీ పోలీసులు ప్రజాపతిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/