టీ20 వరల్డ్ కప్ లో నిన్న గెలవాల్సిన దశ నుంచి టీమిండియా ఓడిపోయింది. గెలుపు అవకాశాలు వచ్చిన టీమిండియా ఆటగాళ్లు వృథా చేశారు. మంచి ఫీల్డర్లుగా పేరుగాంచిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు క్యాచ్ లు జారవిడిచి, రనౌట్లు చేయకపోవడం అందరినీ షాక్ కు గురిచేసింది. ఫీల్డింగ్ వైఫల్యం కారణంగానే భారత్ ఓడింది. లేకుంటే ఫలితం మరోలా ఉండేది. టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాకు తొలి పరాజయం ఎదురైంది.
పేస్, బౌన్సీ పిచ్ పై మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా కేవలం 133 పరుగులే చేయగలిగింది. సూర్యకుమార్ యాదవ్ 68 పరుగులతో ఒక్కడే రాణించాడు. మిగతా బ్యాటర్స్ అంతా సౌతాఫ్రికా బౌలింగ్ దాడికి క్యూ కట్టారు.
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన సౌతాఫ్రికాను భారత బౌలర్లు బెంబేలెత్తించారు. పవర్ ప్లేలోనే 3 వికెట్లు కూల్చి ఆ జట్టును ఓటమి దిశగా నడిపించారు. అయితే మార్కమ్ (52), మిల్లర్ 59 పరుగులతో నిలబడి గెలిపించారు. అయితే వీరిద్దరూ ఇచ్చిన సులవైన క్యాచ్ లు, రనౌట్లను భారత ఆటగాళ్లు జారవిడవడంతో భారత్ జట్టు ఓడింది. ఆ క్యాచ్ లు పట్టి ఉంటే మ్యాచ్ మరోలా ఉండేది.
అయితే ఇదే పిచ్ పై ఆడిన నెదర్లాండ్ పాకిస్తాన్ మ్యాచ్ లో 39 బాల్స్ లో 43 రన్స్ చేయలేక పాకిస్తాన్ ఆపసోపాలు పడింది. అయితే కేవలం 18 బంతుల్లోనే సౌతాఫ్రికా 48 పరుగులు చేసింది. సౌతాఫ్రికా చేతిలో టీమిండియా ఓడిపోవడంతో పాకిస్తాన్ దాదాపు సెమీస్ రేసులోంచి తప్పుకున్నట్టు అయ్యింది. గ్రూపులో సౌతాఫ్రికా అగ్రస్థానానికి చేరుకోగా.. టీమిండియా రెండో స్థానంలో నిలిచింది. టీమిండియా ఓటమితోనే పాకిస్తాన్ సెమీఫైనల్ అవకాశాలు కోల్పోయినట్టైంది.
సౌతాఫ్రికాతో మ్యాచ్ లో భారత్ గెలవాలని పాక్ అభిమానులు పూజలు చేశారు.భారత్ గెలిస్తే పాక్ సెమీఫైనల్ రేసులోకి దూసుకొచ్చేది. కానీ ఓడిపోవడంతో ఆ జట్టు అదృష్టాన్ని నమ్ముకోవాల్సి వస్తోంది. భారత్-పాక్ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందని తాజాగా ఆరోపిస్తున్నారు. సూపర్ ఫామ్ లో ఉన్న భారత్ టాప్ 5 బ్యాటర్లు దారుణంగా విఫలమవ్వడం.. చేతికి వచ్చిన సునాయస క్యాచ్ లను నేలపాలు చేయడం.. ఈజీ రనౌట్లను చేయలేకపోవడమే ఫిక్సింగ్ కు సాక్ష్యాలని పేర్కొంటున్నారు. పాక్ ను అడ్డుకోవాలనే కుట్రతోనే భారత్ ఈ మ్యాచ్ ను తేలికగా తీసుకుందని ఆరోపిస్తున్నారు.
పాక్ సెమీస్ చేరవద్దనే ఉద్దేశంలోనే భారత్ కావాలనే మ్యాచ్ ఓడిపోయిందని కొందరు పాక్ అభిమానులు, మాజీ కామెంట్స్ చేస్తున్నారు. కావాలనే ఫీల్డింగ్ చెత్తగా చేశారని.. బాలీవుడ్ యాక్టర్స్ కంటే కూడా విరాట్ కోహ్లీ, రాహుల్, రోహిత్ లు బాగా నటించారని సోషల్ మీడియాలో పాక్ అభిమానులు ఆడిపోసుకుంటున్నారు.
మొత్తంగా పాక్ ఆరోపణలతో ఇప్పుడు భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ పై ఫిక్సింగ్ నీలినీడలు కమ్ముకున్నాయి. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.