బ్యాంకోల్ల 'బ్లాక్' మ్యాజిక్

Update: 2016-11-13 11:30 GMT
ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నది సామెత... దాన్ని కాస్త రివర్సు చేస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్యాంకు అధికారులకు కరెక్టుగా సూటవుతుంది. సుబ్బి చావు ఎంకి పెళ్లికొచ్చిందని మార్చుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. పెద్ద నోట్లు రద్దవడంతో సామాన్య ప్రజలు నానా పాట్లు పడుతున్న తరుణంలో బ్యాంకు అధికారులు, సిబ్బంది ఈ పరిస్థితిని తెలివిగా క్యాష్ చేసుకుంటున్నారు. రోజుకు 4 వేలు మార్చుకునే ఛాన్సున్నా కూడా ప్రజలకు వెయ్యి, 2 వేలతో సరిపెట్టి బ్యాక్ డోర్లో బడాబాబులకు భారీ మొత్తంలో మార్చిపెడుతున్నారు. అందుకు కమీషన్లు అందుకుంటున్నారు. 20 శాతం నుంచి 40 కమీషను అందుకుంటూ ఎంత మొత్తం పాత నోట్లకైనా కొత్త నోట్లు ఇస్తున్నారు.

రోజుకు నాలుగు వేల రూపాయల వరకూ బ్యాంకుల నుంచి పాత కరెన్సీని మార్చుకోవచ్చన్నది ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు. కానీ బ్యాంకుల్లో జరుగుతున్నది వేరు. గంటల కొద్దీ క్యూలైన్లలో నిలబడి, కౌంటర్ వద్దకు వెళ్లిన తరువాత, వారికి దొరుకుతున్నది ఒకట్రెండు వేలే.  

అక్రమార్కులతో కుమ్మక్కైన బ్యాంకు అధికారులు ఈ తరహా దందాలతో తమ జేబులు నింపుకుంటున్నట్టు విమర్శలొస్తున్నాయి. ఇప్పటికే చాలామంది బ్యాంకు అధికారులు, సిబ్బంది ఇలా చేసి భారీగా సంపాదించేశారట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News