టీడీపీతో పొత్తు... బీజేపీని వారు ఒప్పిస్తార‌ట..!

Update: 2022-12-30 05:11 GMT
వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో అధికారంలోకి వ‌చ్చి తీరాల‌ని కంక‌ణం క‌ట్టుకున్న టీడీపీ.. దీనికి సంబంధించి త‌న ప్ర‌య‌త్నాలు తాను చేస్తోంది. అయితే.. ఒంట‌రిగా వెళ్తే.. గెలుపు గుర్రం ఎక్క‌డం క‌ష్ట‌మ‌నే విష‌యం గ‌త ఎన్నిక‌ల్లో రుజువు అయిపోయింది. దీంతో వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో మాత్రం వ్యూహాత్మ‌కంగానే ముందుకు సాగాల‌ని టీడీపీ అధినేత నిర్ణ‌యించుకున్నారు.

ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ఆయ‌న జ‌న‌సేన‌కు అందుబాటులోకి వ‌చ్చార‌నే చ‌ర్చ సాగుతోంది. జ‌న‌సేన అధినేత కూడా.. ఈ విష‌యాన్ని పైకిప్ర‌స్తావించ‌క‌పోయినా..వైసీపీ వ్య‌తిరేక ఓటుబ్యాంకును మాత్రం చీల‌నివ్వ‌బోన‌ని చెబుతున్నారు.

ఈ క్ర‌మంలో ఆయ‌న కూడా టీడీపీ వైపు మొగ్గు చూపించే  అవ‌కాశం ఉంది. ఈ రెండు పార్టీలు క‌లిస్తే.. బెట‌రే.. ఏపీలో అధికారంలోకి వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంది.

కానీ, ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏదైనా జ‌రిగితే.. దానిని ఆప‌గ‌లిగే వారు ఎవ‌రు?  అనేది చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ప్పుడు కేంద్రంలో బ‌లంగా ఉన్న బీజేపీనే వారికి గుర్తుకు వ‌స్తోంది.

ఈ క్ర‌మంలో బీజేపీ కోసం చంద్ర‌బాబు ప్ర‌య‌త్ని స్తున్నారు. కానీ,దీనికి ఏపీ బీజేపీలోని ఓ వ‌ర్గం నాయ‌కులు ముఖ్యంగా ఆర్ ఎస్ ఎస్ భావ‌జాలం ఉన్న నిఖా ర్సయిన నాయ‌కులు మాత్రం వ‌ద్ద‌ని క‌రాఖండీగా చెబుతున్నారు.

కానీ, బీజేపీలో ఉన్న జంప్ జిలానీలు.. అంటే.. టీడీపీ నుంచి వ‌చ్చి బీజేపీలో ప‌ద‌వులు అనుభ‌విస్తున్న వా రు.. మాత్రం టీడీపీ-బీజేపీ క‌లిసి.. పోటీ చేస్తే.. ఇక తిరుగులేద‌ని అంటున్నారు. అంతేకాదు, రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు, మిత్రులు ఎవ‌రూ ఉండ‌రంటూ.. 2019 నాటి ఎపిసోడ్‌ను తెర‌మ‌రుగు చేసి.. బీజేపీతో చేతులుక‌లిపేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మ‌రి ఏమేర‌కు స‌క్సెస్ అవుతారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News