హైదరాబాద్ లో పని చేసే ఏపీ సచివాలయ ఉద్యోగుల మీద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎంత అభిమానం ఉందన్న విషయం తాజాగా మరోసారి స్పష్టమైంది. ఏళ్లకు ఏళ్లుగా హైదరాబాద్ లో సెటిల్ అయి.. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ రాజధాని నగరమైన అమరావతికి తరలివెళ్లాల్సిన నేపథ్యంలో.. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల్ని తీర్చేందుకు.. వారు కోరిన విధంగా ప్రత్యేక రైలును ఏర్పాటు చేసేందుకు ఆయన యుద్ధప్రాతిపదికన సిద్ధం చేశారు. రైల్వే మంత్రి సురేశ్ ప్రభుతో నడిపిన విందు రాజకీయం సక్సెస్ కావటమే కాదు.. ఒక రైలును ఎంత వేగంగా ఏర్పాటు చేయొచ్చో ఈ ఉదంతం స్పష్టం చేసింది.
ఏపీ ఉద్యోగులు కోరుకున్నట్లే ఏపీ.. తెలంగాణ మధ్య ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. ఈ రైలు పుణ్యమా అని ఒంట్లోకాస్త ఓపిక ఉన్న వారంతా వెంటనే ‘అమరావతి’కి మారిపోవాల్సిన సమస్యను అధిగమించేలా చేస్తుంది. అక్కడ ఇళ్లు దొరకటం ఇబ్బందిగా ఉందని కొందరు.. అద్దెలు ఎక్కువగా ఉన్నాయని మరికొందరు.. ఫ్యామిలీలో ఎక్కువ మంది హైదరాబాద్ తో ‘లెక్కలు’ (ఉద్యోగాలు.. చదువులు.. ట్రీట్ మెంట్ లాంటివి) ఉన్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు అమరావతికి షిఫ్ట్ కావటం ఇబ్బంది అవుతుంది కదా అనే మాటలకు ఈ ప్రత్యేక రైలు సమాధానం అవుతుంది.
అంతా బాగానే ఉన్నా అసలు సమస్య అంతా ఈ రైలుతో కొత్త సమస్యలు తెర మీదకు రావటం ఖాయం. ఈ ప్రత్యేక ట్రైన్ సికింద్రాబాద్ లో ఉదయం5.30గంటలకు స్టార్ట్ అయి.. గుంటూరుకు 10.08 (షెడ్యూల్ ప్రకారం) చేరుకుంటుంది. ఒకవేళ.. గుంటూరులో ప్రభుత్వ కార్యాలయం ఉంటే.. రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి ఆఫీసుకు చేరుకొని సీట్లో సర్దుకునేసరికి 11 గంటలు కావటం ఖాయం. ఇక.. సాయంత్రం 6.20కి బండి కాబట్టి.. 5.30 వరకైతే తప్పనిసరిగా పని చేసే అవకాశం ఉంది.
గుంటూరు కార్యాలయాల్లో పని చేసే వారి పరిస్థితి ఇలా ఉంటే.. ఇక విజయవాడలో పని చేసే వారి లెక్క చూస్తే.. ఉదయం11 గంటలకు బెజవాడ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. అక్కడ నుంచి ఆఫీసుకు చేరుకొని సీట్లో కూర్చొని ఫైల్ చూసే సరికి 12 గంటలు. గంటకే భోజనం. సాయంత్రం 5.30 గంటలకేట్రైన్ నేపథ్యంలో 4.30 గంటలకే దుకాణం మూసేయటం ఖాయం. అదే జరిగితే.. 4.30 గంటలకు మించి అమరావతి ట్రైన్లో హైదరాబాద్.. బెజవాడల మధ్య షటిల్ కొట్టే వారు పని చేసే సమయం. అది కూడా.. భోజనం వేళల్ని కలుపుకుంటే.. భోజనం చేసే సమయాన్ని అరగంట మినహాయితే వారు పని చేసేది నాలుగు గంటలు. ఒకవిధంగా చెప్పాలంటే వారి పని మొత్తం రైల్లో ప్రయాణించటమేనని చెప్పాలి.
ఇలా ట్రైన్లో ప్రయాణించే వారు తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ కు చేరుకునే సరికి రాత్రి 11 గంటలు అవుతుంది. ఇంటికి చేరుకునేసరికి పన్నెండు కొట్టటం ఖాయం. మళ్లీ ఉదయాన్నే 5.30 గంటలకు ట్రైన్ దొరకబుచ్చుకోవాలంటే 4.30 గంటలకే ఇంట్లో నుంచి బయలుదేరాల్సి ఉంటుంది. అదే జరిగితే.. షటిల్ కొట్టే ద్యోగి జీవితం మొత్తం ట్రైన్లోనే గడిచిపోవటం ఖాయం. అటు ఇంటికి..ఇటు ఆఫీసుకు ఏ మాత్రం సాయంగా ఉండదనటంలో ఎలా సందేహం లేదు. అదే జరిగితే.. ఏపీ ఆఫీసుల్లో వర్క్ కల్చర్ మాటేమిటి? అన్నదే ఇక్కడ ప్రశ్న. సదుపాయం కల్పించే ఉద్దేశంతో మొత్తంగా పనికే ఇబ్బంది కలిగేలా మారితే..? అన్నదే ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న. చర్చ పరంగా వినిపిస్తున్న ఈ మాటలు ప్రాక్టికల్ గా మరెన్ని సమస్యల్ని తెర మీదకు తీసుకొస్తాయో చూడాలి.