శంకుస్థాపనలో మోడీ మినిట్ టు మినిట్ షెడ్యూల్

Update: 2015-10-20 03:59 GMT
ఏపీ ప్రజలతో పాటు.. తెలుగు ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అమరావతి శంకుస్థాపన కార్యక్రమం మరో రెండు రోజుల్లో జరగనుంది. చరిత్రలో నిలిచిపోయేలా శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టాలని.. ప్రపంచం మొత్తం అమరావతి రాజధాని నిర్మాణం గురించి మాట్లాడుకోవాలన్న ఆలోచనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు.

దీనికి తగ్గట్లే ఏర్పాట్లు సాగుతున్నాయి. భారీగా శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టటం ద్వారా అమరావతికి సరికొత్త ఇమేజ్ తీసుకురావాలన్నది చంద్రబాబు లక్ష్యంగా చెబుతున్నారు. మోస్ట్ హ్యాపనింగ్ ప్లేస్ గా అమరావతికి పేరు తీసుకురావాలని ఆయన భావిస్తున్నారు. అమరావతికి సరికొత్త బ్రాండ్ ఇమేజ్ అవసరమైన నేపథ్యంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని భారీగా నిర్వహించటం ద్వారా అలాంటి ఇమేజ్ ను తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు.. పలువురు విదేశీ..స్వదేశీ వీవీఐపీలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక.. అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోడీ ఎంతసేపు ఉండనున్నారు? ఆయన ఏయే కార్యక్రమాల్లో పాల్గొంటారు. మోడీ మినిట్ టు మినిట్ షెడ్యూల్ ఎలా ఉంటుందన్న సందేహం పలువురిలో ఉంది. శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా ఆయన షెడ్యూల్ చూస్తే..

మధ్యాహ్నం 12.30 గంటలకు శంకుస్థాపన ప్రాంగణానికి ప్రధాని మోడీ రాక

మధ్యాహ్నం 12.30 నుంచి 12.35 వరకు అమరావతి పైలాన్ సందర్శన

మధ్యాహ్నం 12.35 నుంచి 12.43 వరకు రాజధాని శంకుస్థాపన పూజ

మధ్యాహ్నం 12.43 నుంచి 12.45 మధ్యలో వేదిక మీదకు చేరుకుంటారు

మధ్యాహ్నం 12.45 నుంచి 12.48 వరకు ప్రధానికి ప్రముఖులు పుష్పగుచ్చాలు అందించటం

మధ్యాహ్నం 12.48 నుంచి 12.50 వరకు మా తెలుగుతల్లి గీతారాపన

మధ్యాహ్నం 12.50 నుంచి 12.53 వరకు జపాన్ మంత్రి యూషీకీటకీ ప్రసంగం

మధ్యాహ్నం 12.53 నుంచి 12.56 వరకు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రసంగం

మధ్యాహ్నం 12.56 నుంచి 01.01 వరకు కేంద్రమంత్రి ప్రసంగం

మధ్యాహ్నం 01.01 నుంచి 01.10 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్పీచ్

మధ్యాహ్నం 01.11 నుంచి 01.43 వరకు ప్రధాని నరేంద్ర మోడీ స్పీచ్

మధ్యాహ్నం 01.43 నుంచి 01.45 వరకు ప్రధానికి.. ప్రముఖులకు వేదిక మీద సత్కారం

మధ్యాహ్నం 01.45 నుంచి 01.50 మధ్యలో వేదిక మీద నుంచి తిరిగి వెళ్లిపోవటం
Tags:    

Similar News