నవ్యాంధ్ర నూతన రాజధానిని విశ్వనగరంగా.. జీవన యోగ్య నగరంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. కానీ.. శాస్ర్తీయ అధ్యయనాలు మాత్రం అమరావతి అత్యంత ప్రమాదకర నగరం కానుందని చెబుతున్నాయి. ఇప్పటికే భూకంప ప్రమాదాలు - వరద ముప్పుల గురించి ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో తాజాగా కాలుష్యం తీవ్రంగా ఉందని తేలింది. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు - ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంయుక్తంగా చేసిన సర్వే ఈ సంగతి వెల్లడించింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి చెరోవైపు ఉన్న విజయవాడ - గుంటూరు నగరాలతో పాటు వాటి పరిసరప్రాంతాలన్నీ వాయు - జల - ధ్వని కాలుష్కాలకు నెలవయ్యాయని తేల్చింది. అంతేకాదు.. దేశంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఈ రెండు నగరాలను చేర్చారు.
విజయవాడ - గుంటూరు నగరాలు.. ఆ పరిసరాలన్నీ కాలుష్యమయమని తేల్చడంతో రెండింటి మధ్య ఉన్న అమరావతి కూడా కాలుష్యభరితమనే అర్థమవుతోంది. ఈ నివేదిక ప్రకారం గుంటూరు - విజయవాడ నగరాల్లో ప్రజలు రోజుకు వంద టన్నుల కాలుష్యాన్ని పీలుస్తున్నారని అంచనా.ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం ప్రతి ఎనిమిది గంటలకు క్యూబిక్ మీటర్ గాలిలో 400 గ్రాముల వరకు కార్బన్ మోనాక్సైడ్ ఉండవచ్చు. కానీ విజయవాడ ఆటోనగర్ లో ఇది ఏకంగా 4000లుగా ఉంది. వాణిజ్య - నివాస ప్రాంతాల్లో 2000 గ్రాములుగా ఉంది. మరోవైపు రాజధాని అమరావతి ప్రాంతంలోని భూగర్భ జలాలు కూడా కలుషితమేనట. పరిశ్రమల నుంచి వస్తున్న వ్యర్థాల కారణంగా భూగర్భ జలాల్లో యాసిడ్ రేంజ్ భారీగా పెరిగింది.
విజయవాడ నగరం మధ్యనుంచి వెళ్లే ఏలూరు - బందరు - రైవస్ కాల్వల్లో జల కాలుష్యం ప్రమాద స్థాయికి చేరింది. గుంటూరుకు తాగునీరు అందించే గుంటూరు చానల్‌కూడా కాలుష్య కోరల్లో చిక్కుకున్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెస్తే నే రాజధానిలో జలకాలుష్యానికి చెక్ పెట్టడం సాధ్యమవుతుందని చెబుతున్నారు. వాయు కాలుష్యం కారణంగా వచ్చే ఊపరితిత్తుల సమస్యలు - క్రానిక్ అబ్ స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్ - న్యుమోనియా కేసులు ఎక్కువగా విజయవాడ - గుంటూరు జిల్లాల్లో ఎక్కువగా నమోదవుతుండడంతో చూస్తుంటేనే ఇక్కడి వాయు కాలుష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దానికి తాజా నివేదిక మరింత బలం చేకూరుస్తోంది. మొత్తానికి జీవన యోగ్య నగరంగా నిర్మించాలనుకుంటున్న అమరావతి ఆదిలోనే ఆ ప్రమాణాలకు ఆమడ దూరంలో నిలుస్తోంది.