మహిళలు ఉద్యమాలు చేయకూడదా రోజా?

Update: 2020-01-13 17:30 GMT
అమరావతి రైతులు, మహిళలను కించ పరుస్తూ వ్యాఖ్యలు చేసిన అనంతరం ఇతర వివాదాల్లో చిక్కుకుని పదవి పోగొట్టుకున్న ఎస్వీబీసీ మాజీ చైర్మన్ పృథ్వీరాజ్ సంగతి మర్చి పోకముందే వైసీపీ కి చెందిన కీలక నేత, ఏపీఐఐసీ చైర్మన్, మహిళా ఎమ్మెల్యే, మాజీ హీరోయిన్ అయిన రోజా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అమరావతిలో మహిళలను కించపరిచేలా ఆమె మాట్లాడారాంటూ రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఆగ్రహిస్తున్నారు. ఒక మహిళా నేతగా మహిళలను ప్రోత్సహించాల్సింది పోయి వారిని తక్కువ చేసి మాట్లాడుతారా అంటూ రోజాపై మండిపడుతున్నారు.

ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో చేస్తున్న ఉద్యమం పై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేయడమే ఈ ఆగ్రహానికి కారనమైంది. కొందరు రాజకీయనేతలు ఆడ వాళ్లను ముందుపెట్టి ఉద్యమం చేయిస్తున్నారని, ఆడంగి వెధవల్లా వెనక దాక్కుంటున్నారా? అని రోజా అన్నారు. ఆడ వాళ్లను రోడ్ల పైకి పంపించి పోలీసులు కొట్టారంటూ దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని ధ్వజమెత్తారు. ‘అమరావతి లో మగవాళ్లు లేరా?  వాళ్లకు ఉద్యమాలు చేసే దమ్ములేదా? అని ప్రశ్నించారు. అమరావతి ప్రాంత మహిళలందరూ స్వార్థంతోనే ఉద్యమాలు చేస్తున్నారని ఆరోపించిన రోజా, హైదరాబాద్ లోని కూకట్ పల్లి నుంచి ఇక్కడికి బస్సుల్లో వచ్చి ధర్నాలు చేస్తున్నారని అన్నారు.

కాగా రోజా వ్యాఖ్యల పై అంతటా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఉమెన్ ఎంపవర్‌మెంట్ గురించి మాట్లాడే... టీవీషోల్లో పెద్దగా ఉంటూ పురుషుల పీడన కు బలైపోయే మహిళలకు అండగా ఉండేలా వ్యవహరించేలా కనిపించే రోజాయే మహిళలకు ఉద్యమాలెందుకు అన్నట్లుగా మాట్లాడడం వివాదాస్పదమైంది.


Tags:    

Similar News