టీడీపీ పార్టీ పండుగ మహానాడు సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ కొత్త ప్రతిపాదనను తీసుకువచ్చింది. తెలంగాణ తెదేపా ప్రధాన కార్యదర్శి అమర్నాథ్ బాబు పార్టీ కార్యదర్శి హోదాలో తెలంగాణలో పార్టీ పరిస్థితి, తమ భవిష్యత్ కార్యాచరణపై స్పందించారు.
ప్రస్తుతం తెలంగాణలో పూర్తిగా కుటుంబ పాలన సాగిస్తోందని.. ప్రశ్నించినవారిని నిర్దాక్షిణ్యంగా అణచివేస్తున్నారని ఆరోపించారు. కాసుల కోసం కక్కుర్తిపడి ప్రాజెక్టులను రీడిజైన్ చేస్తున్నారని అమర్ నాథ్ బాబు మండిపడ్డారు. మున్ముందు తెలంగాణ అమరవీరుల స్థూపం ఏర్పాటుకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి - రమణ సారధ్యంలో ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి జరిగిందీ అంటే అది కేవలం ఎన్టీఆర్ - చంద్రబాబు హయాంలో మాత్రమే జరిగిందని చెప్పారు.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు నాయకత్వం అంతా సమష్టిగా కదులుతుందని అమర్ నాథ్ బాబు స్పష్టం చేశారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ జెండా పీకేస్తామంటూ వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. తాజాగా అన్నిచోట్ల జరిగిన మినీమహానాడును చూసైనా టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కళ్లు తెరవాలన్నారు. భవిష్యత్తులో ఎవరి జెండాను ఎవరు పీకేస్తారో అందరూ వేచిచూడాలన్నారు. కార్యకర్తల మనోబలం - మానసిక స్థైర్యంతో దుకు సాగుతామని చెప్పారు.