పెద్ద నోట్ల రద్దుతో లాభపడినోళ్లు ఎవరైనా ఉన్నారా? ముఖ్యంగా పారిశ్రామిక వేత్తలు అంటే.. అవుననే మాట సోషల్ మీడియాలో వినిపించటమే కాదు.. అందుకు సమర్థవంతమైన వాదనను వినిపిస్తుంది కూడా. వారి వాదనలు ఒక పక్క.. ఇంకోవైపు కన్వీన్స్ చేసేలా ఉన్న కొన్ని అంశాలు చూస్తే కొత్త సందేహాలు పుట్టుకురావటం ఖాయం.
అయితే.. అనుకున్నవన్నీ నిజాలు ఎలా అవ్వమో.. అబద్ధాలు కూడా కావన్న విషయాన్ని కొందరు ప్రస్తావిస్తున్నారు. ఏది ఏమైనా.. నోట్ల రద్దుపై మోడీ తీసుకున్న నిర్ణయంతో అంబానీ.. అదానీ భారీగా లాభం పొందినట్లుగా వినిపిస్తున్న వైనానికి సంబంధించిన ఈ వాదన మాది కాదు. సోషల్ మీడియాలోనూ.. మరికొందరి నోట వినిపిస్తున్న ఈ వాదన విన్నప్పుడు కన్వీన్స్ అయ్యేలా ఉండటం గమనార్హం. ఇంతకీ ఆ వాదన ఏమిటి? అందులోని అంశాలు ఏమిటన్నది చూస్తే..
1. పెద్ద నోట్ల రద్దు చేస్తూ ప్రధాని మోడీ నిర్ణయంతో లాభపడినట్లుగా ప్రచారం జరుగుతున్న అంబానీ.. అదానీలు ఇద్దరూ గుజరాతీయులే కావటం గమనార్హం.
2. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అదానీల వ్యాపార సామ్రాజ్యం మరింత బాగా విస్తరించింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. ఆయన ఆశీస్సులతోనే అదానీ తన వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కించిన వైనాన్ని కాదనలేం.
3. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేప్టటిన తర్వాత జరిపిన పలు విదేశీ యాత్రలలో మోడీ సన్నిహితుడి హోదాలో అదానీ పాల్గొన్న ఉదంతాలు ఉన్న మాట నిజం కాదా? ఈ పర్యటలన్ని అదానీ తన వ్యాపార ప్రయోజనాల కోసం వినియోగించుకోవటం లేదా?
4. జపాన్ కు చెందిన పెట్టుబడి దిగ్గజం సాఫ్ట్ బ్యాంకుతో అదానీలు జత కట్టటం సందేహంగా చూడాల్సిన అంశాల్లో ఒకటి. సోలార్ రంగంలో ఈ బ్యాంక్ ఏకంగా రూ.1.34లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టులో జత కట్టేందుకు అదానీ గ్రూపు చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలు రావటం గమనార్హం.
5. అంతర్జాతీయంగా బడా పెట్టుబడి సంస్థగా పేరున్న సాఫ్ట్ బ్యాంకు భారత్ లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న అనేక పెట్టుబడుల్ని చూస్తే.. నోట మాట రావటం ఆగిపోవటమే కాదు.. మోడీ మీద అనుమానపు చూపులు పడటం ఖాయం. చైనా ఈ కామర్స్ దిగ్గజం ఆలీబాబాలోసాఫ్ట్ బ్యాంకుకు 32 శాతం వాటా ఉంది. ఈ ఆలీబాబా సంస్థకు ఈ కామర్స్.. మొబైల్ వ్యాలెట్ సంస్థ అయిన పేటీఎంలో 40 శాతం వాటా ఉంది. అంతేనా.. మరో మబైల్ వ్యాలెట్ సంస్థ అయినా ఫ్రీఛార్జ్ ప్రస్తుతం దేశీ ఈ కామర్స్ దిగ్గజం స్నాప్ డీల్ చేతుల్లో ఉంది. ఈ స్నాప్ డీల్ లో ఆలీబాబా.. సాఫ్ట్ బ్యాంక్.. ఫాక్స్ కాన్ విడివిడిగా పెట్టుబడులు పెట్టాయి.
6. పెద్దనోట్ల రద్దుతో డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసులు అందించే సంస్థలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. మొబైల్ వ్యాలెట్ సంస్థ అయిన పేటీఎం ఒక్కరోజులో తాను జరిపే లావాదేవీలకు భిన్నంగా భారీగా లావాదేవీలు జరపటమే కాదు.. నోట్లరద్దు తర్వాత ఒక్కరోజులో 50 లక్షల లావాదేవీల రికార్డును సృష్టించటం మర్చిపోకూడదు.
7. ఈ మొబైల్ వ్యాలెట్ సర్వీసుల్లో కొత్తగా వచ్చినరిలయన్స్ జియో కూడా ఉందన్న విషయాన్ని మర్చిపోలేం. జియో మనీ సర్వీసులను మరింత ఆకర్షణీయంగా మార్చే సన్నాహాల్లో రిలయన్స్ ఉంది. పెద్దనోట్లను రద్దు చేస్తూ మోడీ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తూ ఆ తర్వాతి రోజున పత్రికల్లో పేటీఎం పెద్ద ఎత్తున యాడ్స్ ఇచ్చింది. నిజంగానే దీన్ని సందేహంగా చూడాలా? లేక.. పెద్దనోట్ల రద్దుతో తనకున్నవ్యాపార అవకాశాల్ని విస్తరించే క్రమంలో అలా జరిగిందా? అన్నది మాత్రం తేలాల్సి ఉందన్నవిషయాన్ని మర్చిపోకూడదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/