నంద్యాల ఉప ఎన్నికల్లో - కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ గెలుపు కొరకు పనిచేసిన వారందరినీ అభినందించాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు సూచించారు. అవును ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపు కొరకు కృషి చేసిన మంత్రులు - ఎమ్మెల్యేలతో పాటు ప్రభుత్వ అధికారులను కూడా సన్మానించాల్సిన జాబితాను వివరించారు.
మంత్రులు - ఎమ్మెల్యేలతో పాటు ఇంటిలెజెన్స్ ఛీప్ వెంకటేశ్వరరావును కూడా అభినందించి సన్మానించాలని - అసలు ఈ ఎన్నికల గెలుపుకోసం అధికార పార్టీ నేతలకంటే ఎక్కువగా వెంకటేశ్వరరావు - ఆయన 600 మంది సిబ్బంది పనిచేశారని అంబటి రాంబాబు అన్నారు. ఇంత బాగా పనిచేసిన వీరందరినీ సన్మానించాలని ఆయన చంద్రబాబు కు సూచించారు.
నంద్యాలలో డబ్బు - మీడియా - పోల్ - పొలిటికల్ మేనేజ్ మెంట్ మూలంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధించిందని, అయితే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఊహించినట్లు సాధారణ ఎన్నికలు ఇలా ఉండవని, దీనికి భిన్నంగా ఉంటాయని అన్నారు. వీరందరితో పాటు నంద్యాల ఎన్నికల ప్రచారానికి వెళ్లని నారా లోకేష్ ను ప్రత్యేకంగా అభినందించాలని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. తిట్టను పోరా .. .. అని ఓ సామెత ఉంటుంది .... తిట్టకుండానే రాంబాబు చంద్రబాబు నాయుడు గాలి తీసేశాడు.