వెన‌క్కి త‌గ్గం.. జీవో 1 అమ‌లులోనే ఉంటుంది: అంబ‌టి

Update: 2023-01-06 13:06 GMT
కొత్త సంవ‌త్స‌ర కానుక‌గా.. వైసీపీ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన జీవో 1/2023 పై ప్రతిప‌క్షాలు, ప్ర‌జాస్వామ్య సం ఘాల నుంచి తీవ్ర‌స్తాయిలో వ్య‌తిరేక‌త వ‌స్తున్నా.. ప్ర‌భుత్వం మాత్రం త‌న ప‌నితాను చేసుకునిపోయేందు కు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించింది.  జీవో 1 విష‌యంలో ఏమాత్రం వెన‌క్కి త‌గ్గేది లేదని,  అమ‌లు చేసి తీరుతామ‌ని.. ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. త‌మ‌కు ప్ర‌జ‌ల ప్రాణాలే ముఖ్య‌మని పేర్కొంది.

తాజాగా ఈ విష‌యంపై మంత్రి అంబ‌టి రాంబాబు మాట్లాడుతూ.. జీవో 1 అన్ని పార్టీల‌కూ వ‌ర్తిస్తుంద‌ని తెలిపారు. ఇది కేవ‌లం టీడీపీనో.. చంద్ర‌బాబునో దృష్టిలో పెట్టుకుని తీసుకువ‌చ్చింది కాద‌న్నారు.   జీవో నంబ‌రు 1 అన్ని రాజ‌కీయ పార్టీల‌కు వ‌ర్తిస్తుంద‌న్నారు. తమ పార్టీ కూడా  ఈ జీవోను పాటిస్తుంద‌ని చెప్పారు. ఈ జీవో ప్ర‌కారం రోడ్ల మీద బ‌హిరంగ స‌భ‌లు పెట్ట‌కూడ‌ద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు.

చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు

ఇక‌, అంబ‌టి రాంబాబు.. టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. కుప్పం ప‌ర్య‌ట‌న‌లో చంద్ర‌బాబు జీవో నిబంధ‌న‌ల‌ను పాటించ‌లేద‌ని త‌ప్పు ప‌ట్టారు. పిచ్చి కుక్క మాట్లాడిన‌ట్టుగా కుప్పంలో అరుస్తున్నార‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. చంద్ర‌బాబు ఎక్క‌డ కాలు పెడితే అక్క‌డ జ‌నం పిట్ట‌ల్లా రాలిపోతు న్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.

ప్ర‌జ‌ల ప్రాణాల్ని కాపాడాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉండ‌దా? అని మంత్రి అంబ‌టి ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబు జ‌నంలో తిరిగితే ఏమ‌వుతుంద‌ని మంత్రి ప్ర‌శ్నించారు. గ‌తంలో తిరిగితే ఏమైందో అంద‌రూ చూశార‌ని ఆయ‌న అన్నారు. చంద్ర‌బాబు జ‌నంలో తిరిగిన త‌ర్వాతే క‌దా 23 స్థానాల‌కు ప‌రిమితం చేసింద‌ని ఆయ‌న వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

కుప్పంలో క‌నీసం స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీల‌ను కూడా గెలిపించుకోలేక‌పోయార‌ని ఆయ‌న అన్నారు. ``నా కుప్పం నా కుప్పం అంటూ చంద్ర‌బాబు రంకెలేస్తున్నారు.  క‌నీసం అక్క‌డ ఇల్లు, ఓటు కూడా లేదు`` అని అంబటి నిప్పులు చెరిగారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News