నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తిరిగి నియమించాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్తామని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు వెల్లడించారు. శుక్రవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... నెల రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల కమిషన్ పై ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయగా ఈసీ నిమ్మగడ్డ రమేష్ పదవిని కోల్పోయారని, ఆయన స్థానంలో జస్టిస్ కనగరాజ్ నియమించినట్లు వెల్లడించారు.
దీనిపై టీడీపీ, బీజేపీ నేతలు హైకోర్టుకు వెళ్ళారని, ఈ క్రమంలో ప్రభుత్వ ఆర్డినెన్స్ జీవోలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించిందన్నారు. అయితే ఒక్కో సమయంలో న్యాయం జరగకపోవచ్చని, అలాంటప్పుడు పై కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని, నిమ్మగడ్డ కేసుపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నామని, సుప్రీం కి వెళ్ళబోతున్నట్టు తెలిపారు.
ఎన్నికల్లో మద్యం, డబ్బు అరికట్టాలని చట్టం తీసుకొస్తే దానిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పంపిన లేఖపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంతకం పెట్టారని అంబటి రాంబాబు ఆరోపించారు. ఇలాంటి లేఖల వల్ల ప్రజాస్వామ్యం మంట కలిసిపోతుందని, ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చామని, దీని వల్ల నిమ్మగడ్డ పదవి కోల్పోయారని అంబటి అన్నారు. ఆర్టికల్ 213 ప్రకారం ప్రస్తుత పరిస్థితులలో ఆర్డినెన్స్ ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని , ఈ క్షణం నుంచే రమేశ్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా కొనసాగుతారని ఎన్నికల కమిషనర్ గా కనగరాజ్ కొనసాగడానికి వీలులేదని హై కోర్టు స్పష్టం చేసింది.