బాబూ..లోకేష్ నైనా అది చెప్ప‌మ‌నండి: అంబ‌టి

Update: 2018-07-14 16:14 GMT
ఆడిన మాట త‌ప్ప‌డం.....చేయ‌ను అని చెప్పిన ప‌నిని పదే ప‌దే చేయ‌డం...ఏపీ సీఎం చంద్ర‌బాబు నైజం. ఎవ‌రూ ఊహల‌కు అంద‌ని రీతిలో తాను తీసుకున్న నిర్ణ‌యాల‌పైనే యూట‌ర్న్ తీసుకోవ‌డం....ఏరు దాటాక తెప్ప తగ‌లేయడం వంటివి చంద్ర‌బాబుకు వెన్న‌తో పెట్టిన విద్య‌లు. ఇక‌, అర‌చేతిలో `అమ‌రావ‌తి`ని చూపించ‌డం....`మ‌య‌స‌భ`ను త‌ల‌పించే నిర్మాణాల‌తో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్ట‌డంలో బాబును మించిన నేర్ప‌రి ఎవ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. గోబెల్స్ ప్ర‌చారాలు....చేప‌ట్టిన ఒక‌టో రెండో ప‌థ‌కాల గురించి డ‌ప్పు కొట్టుకోవ‌డం బాబుకు అల‌వాటే. అదే త‌ర‌హాలో తాను ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాల విష‌యంలో కూడా చంద్ర‌బాబు అస‌త్య ప్ర‌చారాలు చేస్తున్నార‌ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు అంబటి రాంబాబు మండిప‌డ్డారు. బాబు ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాలు...ప్రచార ఆర్భాటాలకు తప్ప - ప్రజలకు ఉపయోగ‌ప‌డ‌డం లేద‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. నాలుగేళ్ల‌లో చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌కు చేసిందేమీ లేద‌ని, నిజంగా ప‌థ‌కాలు ప్ర‌జ‌ల‌కు చేరితే ప్ర‌చారం చేసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని అన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు బాబు ప్రవేశ పెట్టిన పథకాలు 110 ఏమిటో చెప్పాలని...కనీసం లోకేష్ తో అయినా చెప్పించాల‌ని....చాలెంజ్ చేశారు.

వైసీపీపై చంద్ర‌బాబు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని రాంబాబు మండిప‌డ్డారు. బీజేపీకి ఓటేస్తే వైసీపీకి వేసినట్లేన‌ని టీడీపీ నాయకులు అభూత కల్పన సృష్టిస్తున్నారని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకోన‌ని ప‌లుమార్లు నొక్కి వ‌క్కాణించిన బాబు....మ‌ళ్లీ మళ్లీ పొత్తు పెట్టుకున్నార‌ని ఎద్దేవా చేశారు. వైసీపీ ఎంపీలు అవిశ్వాసం పెట్టి రాజీనామాలు చేసిన తర్వాతే...త‌ప్ప‌క ఎన్డీఏ నుంచి బాబు బయటికి వచ్చారన్నారు. హామీలన్నీ అమలు చేస్తే ఏమీ ఇబ్బంది లేదని గడ్కరీతో బాబు ముచ్చ‌టించ‌డం దేనికి సంకేత‌మ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. బాబు డ‌బుల్ గేమ్ ఆడుతున్నార‌ని....అటు బీజేపీ - ఇటు కాంగ్రెస్‌ తో అడ్జస్ట్ అవుతున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. టీడీపీ అవినీతిని బ‌ట్ట‌బ‌య‌లు చేస్తాన‌న్న జీవీఎల్‌ నర్సింహారావు ఎందుకు వెన‌క్కు త‌గ్గార‌ని ప్ర‌శ్నించారు. ఏ క్షణంలోనైనా బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు బాబు రెడీ అని అన్నారు. నీతి ఆయోగ్ స‌మావేశాల్లో  మోడీ ఎడమ చేయి తాకితే మహద్భాగ్యమన్నట్లు బాబు ముసిముసిన‌వ్వులు న‌వ్వారని ఎద్దేవా చేశారు. 29 సార్లు ఢిల్లీ వెళ్లిన బాబు....ఆ త‌ర్వాత మీడియాతో ఎందుకు మాట్లాడటం లేద‌ని ప్ర‌శ్నించారు. వెన్నుపోటు పొడ‌వ‌డం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు.
Tags:    

Similar News