ఏపీలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికల నేపథ్యంలో వైసీపీ నేత అంబటి రాంబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. వైసీపీని దెబ్బతీయడం చంద్రబాబు వల్ల కానీ, ఆయన కుమారుడు లోకేశ్ వల్ల కానీ కాదు అని చెప్పిన ఆయన తమ ఎమ్మెల్యేలకు డబ్బులిచ్చి కొనుగోలు చేశారని.... అందుకు ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ప్రకటించారు. తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే ప్రయత్నంలో టీడీపీ నేతలు అడ్డంగా బుక్కయ్యారని ఆయన చెబుతున్నారు.
వైసీపీ ఎమ్మెల్యేలతో టీడీపీ నేతలు ఎవరు ఏంమాట్లాడారు… ఎంత డబ్బు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు అన్న దానికి సంబంధించి త్వరలోనే సాక్ష్యాలు బయటపెడుతామన్నారు. వెళ్లిపోయిన ఎమ్మెల్యేలు ఎంతెంత డబ్బు తీసుకున్నారన్న దానిపైనా ఆధారాలున్నాయన్నారు. త్వరలోనే అన్నీ బయటకు వస్తాయన్నారు. తొందరపడాల్సిన పనిలేదన్నారు. టీడీపీ నేతల ఫోన్లను ట్యాప్ చేశారా అని ప్రశ్నించగా అంత అవసరం లేదని అంబటి రాంబాబు అన్నారు. ఆడియో టేపులు - వీడియో టేపులు అన్ని త్వరలోనే బయటకు వస్తాయన్నారు. ఫోన్ సంభాషణలను రికార్డు చేయడానికి ట్యాపింగే అవసరం లేదని ఫోన్ లో ఎవరైనా రికార్డు చేసుకోవచ్చని... తమ పార్టీకి చెందిన కొందరు నిజాయితీపరులు ఆ పనిచేశారన్నారు. ఏ దొంగ అయినా ఆధారాలు వదిలి వెళ్లడం ఖాయమని, టీడీపీ నేతల విషయంలోనూ అదే జరిగిందన్నారు.
అయితే గాల్లో బాణాలు వేయడంలో ఆరితేరిన అంబటి రాంబాబు మాటలు నిజమని చాలామంది నమ్మడం లేదట. ఒకవేళ ఆయన వద్ద ఆధారాలు ఉంటే వాటితోనే ప్రెస్ మీట్ పెట్టేవారని... గతంలో లోకేశ్ స్నేహితులతో దిగిన ఫొటోలు పట్టుకుని నాలుగైదు సార్లు ప్రెస్ మీట్లు పెట్టిన ఆయన ఇప్పుడు ఆధారాలున్నా కామ్ గా ఉంటారా అన్నది అనుమానమేనని... టీడీపీని బెదిరించడానికే ఆయన ఈ మైండ్ గేమ్ ఆడుతున్నారని అంటున్నారు.