మీటింగ్.. డేటింగ్ అన్న అంబటికి.. బ్రేకింగ్.. వెయిటింగ్ అంటూ గాలి తీశారు
కెలికి మరీ మాట అనిపించుకోవటం వల్ల వచ్చే లాభమేమిటో అస్సలు అర్థం కాదు. అందునా రాజకీయ నేతలు.. మంత్రుల స్థానాల్లో ఉన్న వారు మరింత గౌరవనీయంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా ప్రతి విషయానికి తగదునమ్మా అన్న రీతిలో రియాక్టు అయితే..
కలిగే నష్టం అంతా ఇంతా కాదు. ఆ విషయాన్ని ఏపీ అధికారపార్టీకి చెందిన ముఖ్యనేతలు ఎందుకు మిస్ అవుతున్నారన్నది అర్థం కాదు. తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించిన మంత్రి అంబటి రాంబాబు.. అందుకు తగ్గ మాటలు బాగానే అనిపించుకోవాల్సి వచ్చింది. ఇదంతా చూసినప్పుడు కెలకటం ఎందుకు.. లాగి పెట్టి కొట్టించుకోవటం ఎందుకు? అన్న భావన కలుగక మానదు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీకి వచ్చిన వేళ.. అనూహ్యంగా ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఆహ్వానించటం.. భేటీ కావటం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తానని పవన్ అడిగింది లేదు. కానీ.. ప్రధానితో భేటీ కోసం పవన్ ను రప్పించటం అన్నంతనే.. విషయం ఏమిటి? ఎందుకు? లాంటి సహజ సందేహాలతో పాటు.. తొందరపాటుతో మాట అనే కన్నా.. కాస్తంత ఆచితూచి అన్నట్లుగా రియాక్టు అయితే సరిపోతుంది. కానీ.. వైసీపీ నేతల్లో పలువురికి ఆ మాత్రం వెయిట్ చేసే ఓపిక కూడా ఉండదన్న విషయం తెలిసిందే.
అందుకేనేమో.. మోడీతో భేటీ అయిన జనసేనానిని ఉద్దేశించి.. "మోడీతో మీటింగు.. బాబుతో డేటింగు" అంటూ ఒక ట్వీట్ చేశారు అంబటి రాంబాబు. అంత్యప్రాస మిస్ కాకుండా చేసిన ఈ ట్వీట్ కు పాజిటివ్ రెస్పాన్స్ కంటే కూడా నెగిటవ్ ఇంపాక్టు ఎక్కువగా వచ్చింది. ఆయన చేసిన ట్వీట్ కు స్పందనగా.. బోలెడన్ని పంచ్ లు పడ్డాయి. అందులో మచ్చుకు చూస్తే.. " మీ గుండెకు బ్రేకింగ్' అని ఒకరు ఏసుకుంటే.. మరొకరు 'జగన్ బయట వెయిటింగ్' అంటూ ఎటకారం ఆదేశారు. ఇంకొకరు రాయలేని భాషలో ఏసుకున్నారు.
'ఇంకా ఏమీ కాకుండానే అప్పుడే మెరగటం స్టార్ట్ చేశారు. ఆ మాత్రం భయం ఉండాలి' అంటూ మరో రాయలేని వ్యాఖ్య చేశారు. ఇవే కాకుండా.. అంబటి మీద తరచూ వచ్చే వ్యక్తిగత ఆరోపణలతో పాటు.. ఆయన తరచూ ఇరుకున పడే టాపిక్స్ ను కౌంటర్ కింద తీసుకొచ్చిన వైనం చూస్తే.. ఒక వేలు చూపిస్తే.. రివర్సులో మూడు వేళ్లు మనల్నే చూస్తుంటాయన్న మాటకు తగ్గట్లు..
పవన్ మీద అంత్యప్రాసలతో పంచ్ లు ఎందుకు? అందుకు రివర్సులో ప్రయాసతో కూడా రీపంచ్ లు అవసరమా? అన్నట్లుగా పరిస్థితి తెచ్చుకోవటం ఎందుకు అంబటి? అన్న భావన కలగక మానదు. తాను రాష్ట్ర మంత్రినని.. సందర్భానికి తగ్గట్లు.. ఆచితూచి అన్నట్లు రియాక్టు అవుతానే తప్పించి.. అనవసరమైన సందర్భాలకు రియాక్టు కానన్నట్లుగా వ్యవహరించటం మంచిదన్నది ఎప్పటికి గుర్తిస్తారో?
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.