చిరంజీవి వ్యాఖ్యలపై అంబటి సెటైర్లు!

Update: 2023-01-12 04:03 GMT
జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పై తీవ్ర విమర్శలు చేసే వారిలో ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఒకరు. వైఎస్‌ రాజశేఖరరెడ్డికి వీరవిధేయుడిగా ఉన్న అంబటి ఆయన మరణానంతరం మొదటి నుంచి వైఎస్‌ జగన్‌ కు సైతం అంతే విధేయుడిగా కొనసాగుతున్నారు.

కాపు సామాజికవర్గానికి చెందిన అంబటి రాంబాబు.. పవన్‌ కల్యాణ్‌ పై తీవ్ర విమర్శలు చేయడంతో ముందు వరుసలో ఉంటున్నారు. ఈ విమర్శల వల్లే ఆయనకు జగన్‌ రెండో మంత్రి వర్గ విస్తరణలో మంత్రి పదవి లభించింది. నిత్యం మీడియా ద్వారా లేదంటే సోషల్‌ మీడియాలో పవన్‌ కల్యాణ్‌ పై అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేస్తుంటారు.

తాజాగా వాల్తేరు వీరయ్య మూవీ ప్రమోషన్స్‌ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజకీయాలపైన అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ తానిక రాజకీయాల వైపు తొంగి చూసే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు. అలాగే ఏపీ వ్యవహారాలతో కానీ, ఆ రాష్ట్రంతో కానీ తనకెలాంటి సంబంధం లేదన్నారు. అలాగే ఆ రాష్ట్రంలో తనకు ఓటు కూడా లేదని చిరంజీవి స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో చిరంజీవి వ్యాఖ్యలపై స్పందించిన అంబటి రాంబాబు తాజాగా ట్వీట్‌ చేశారు. 'తల్లిని దూషించిన వారితో తమ్ముడు రాజీపడితే ...  అన్నయ్యకు రాజకీయాల పట్ల విరక్తి కలిగిందేమో?' అని అంబటి పవన్‌ పై సెటైర్లు వేశారు.

గతంలో తన తల్లిని టీడీపీ నేతలు తిట్టించారని పవన్‌ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అలాగే శ్రీరెడ్డి సైతం పవన్‌ తల్లిపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ ఘటనను అంబటి ఈ ట్వీట్‌ ద్వారా పరోక్షంగా గుర్తు చేశారు. తల్లిని దూషించిన టీడీపీ వారితో పవన్‌ కల్యాణ్‌ రాజీపడ్డాడని.. ఇది నచ్చకే చిరంజీవికి రాజకీయాల పట్ల విరక్తి కలిగిందేమో అని అంబటి సెటైరికల్‌ ట్వీట్‌ చేశారు.

ఈ నేపథ్యంలో అంబటి ట్వీట్‌ పై పవన్‌ అభిమానులు మండిపడుతున్నారు. కామెంట్ల రూపంలో తిట్టిపోస్తున్నారు. ఒక నెటిజన్‌ ఇలా ఘాటుగా స్పందించాడు.. "పదవి కోసం తల్లిని,చెల్లిని వాడుకొని వదిలేస్తే వారికి విరక్తి కలగదా! బాబాయ్‌ తలని తీసుకుంటే అతని కూతురికి విరక్తి కలగదా! కూతురి వయసున్న అమ్మాయిలతో సరసమాడావు నీకు సిగ్గు కలగదా! శవాల మీద చిల్లర ఏరుకున్నావు నీకు బుద్ది కలగదా! దిక్కుమాలిన రాజకీయం చేస్తున్నారు జనానికి విరక్తి కలగదా??" అంటూ అంబటి పై ఫైరయ్యాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News