భారత్ వెళ్లే తమ వారికి వార్నింగ్ ఇచ్చేసిన అమెరికా.. బ్రిటన్

Update: 2019-12-14 07:02 GMT
పౌరసత్వ సవరణ చట్టం దేశంలోని ఈశాన్య భారతాన్ని ఎంతలా అగ్గిపుట్టిస్తుందో తెలిసిందే. అసోంతో పాటు మరిన్ని రాష్ట్రాల్లో ఈ చట్టంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నిరసనలు నెమ్మదిగా మిగిలిన రాష్ట్రాలకు వ్యాపిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ.. బెంగళూరులో నిరసనలు షురూ అయ్యాయి. దీంతో.. ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

ఇలాంటి వేళ తమ దేశ పౌరులు భారత్ కు వెళుతుంటే.. అలాంటి వారికి హెచ్చరికలు చేస్తోంది అమెరికా.. బ్రిటన్. భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆ దేశాలు హెచ్చరిస్తున్నాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా భారత్ లోని కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్నాయని.. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలైన అసోం.. త్రిపురల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న వైనాన్ని వెల్లడించాయి.

ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారని.. రవాణాకు కూడా ఇబ్బందులు ఉన్నాయని.. అందుకే ఈశాన్య భారతానికి వెళ్లే విదేశీయులు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. స్థానిక మీడియా నుంచి సమాచారం అందుకోవాలి. స్థానిక అధికారుల సూచనల్ని తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నాయి. అమెరికా.. బ్రిటన్ దేశాలు రెండు తమ దేశీయులకు ఈ తరహా హెచ్చరికల్ని జారతీ చేశాయి.
Tags:    

Similar News