భారతీయులకు అమెరికా గుడ్ న్యూస్

Update: 2019-08-29 10:57 GMT
అమెరికన్ వీసా అంటే ఇప్పుడు బంగారు బాతు గుడ్డుతో సమానం. అగ్రరాజ్యం వెళ్లి డాలర్లు సంపాదించుకుందామని ఆశలు పెంచుకునే యువతకు ఇప్పుడు అమెరికా గుడ్ న్యూస్ చెప్పింది. భారతీయులకు మేలు చేసే ఓ మంచి నిర్ణయాన్ని తీసుకుంది.

సెప్టెంబర్ 1 నుంచి అమెరికా వీసాకు దరఖాస్తు చేసుకునే కొన్ని వర్గాలకు ఇంటర్వ్యూను తొలగించి ఊరట కల్పించింది. ట్రావెల్  ఏజెంట్ అసోసియేషన్ తో తాజాగా సమావేశమైన అమెరికా కాన్సులేట్ ఈమేరకు నిర్ణయం తీసుకుంది. వీసా రెన్యువల్ సమయాన్ని తగ్గించడం.. వినియోగదారుల సర్వీసును మెరుగుపర్చడం కోసమే ఈ నిర్నయాన్ని అమెరికా తీసుకున్నట్టు ఆమె వెల్లడించింది.

అమెరికాకు వెళ్లాలనుకునే వారిలో ముఖ్యంగా 14 ఏళ్లలోపు పిల్లలు, 79 ఏళ్లకు మించి వృద్ధులకు ఇక సెప్టెంబర్1 నుంచి ఇంటర్వ్యూను తొలగిస్తున్నట్టు అమెరికా కాన్సులేట్ ప్రకటించింది. దేశంలోని 11 కేంద్రాల్లో దరఖాస్తుదారులు తమ వయసు ధ్రువీకరణ పత్రాలను ఇందుకోసం సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది. ఇక ఉద్యోగాలు- పని మీద వెళ్లే వారికి కూడా వారంలోనే పంపించేలా ఏర్పాట్లు చేసింది.

ఇప్పటివరకు ఇలా పిల్లలు- వృద్ధులు దరఖాస్తు చేసుకున్నాక ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉండేది. ఇక మిగతావారి విషయంలోనూ నిబంధనలను సడలించారు. దరఖాస్తు చేసుకున్నాక 14ఏళ్ల పైనున్న యువత- ఉద్యోగులు ఏడు పనిదినాల్లోనే ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. అమెరికాలో ఏ పోస్టుకు ఎంపికయ్యారు? ఏం చేస్తారనే దానిపై ఇంటర్వ్యూను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అన్ని సరిగా ఉంటే జాప్యం లేకుండా వారంలోనే ప్రక్రియ పూర్తి చేసేలా ఏర్పాట్లు చేశారు. నెలల తరబడి వేచి ఉండే అవసరం ఇక ఉండదు.
Tags:    

Similar News