ఓ భారత జాతీయుడిపై ఐక్యరాజ్యసమితిలో ఉగ్రవాద ముద్ర వేయడానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలకు అమెరికా చెక్ పెట్టింది. అప్ఘనిస్తాన్ లో భారత నిర్మాణ సంస్థలో ఇంజినీర్ గా విధులు నిర్వహిస్తున్న వేణుమాధవ్ డోంగారా తమ దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు, దాడులు చేస్తున్నారని చైనా మద్దతుతో పాకిస్తాన్ ఐరాసలో అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని పట్టు బట్టింది.
పాకిస్తాన్ చేసిన ఈ ప్రతిపాదనను సాంకేతిక కారణాలను సాకుగా చూపి అమెరికా దీనిని తిరస్కరించింది. డోంగారా ఉగ్రవాద కార్యకలాపాలకు ఆధారాలు చూపించాలన్న అమెరికా కు పాకిస్తాన్ ఇంతవరకు చూపలేదు. దీంతో డోంగారాను ఉగ్రవాదిగా ప్రకటించేందుకు అమెరికా నో చెప్పింది. ఐక్యరాజ్యసమితిలో ఈ మేరకు ప్రకటించింది.
డోంగారాతో భారత్ ను ఉగ్రవాద దేశంగా ఐరాసలో చేయాలనుకున్న ప్రయత్నాలకు అమెరికా చెక్ చెప్పింది. గతంలో పాకిస్తాన్ ఉగ్రవాది మసూద్ అజార్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా భారత్ ప్రతిపాదిస్తే చైనా అడ్డుకుంది. తర్వాత సభ్యదేశాలు అన్ని కలిసి 2019లో ప్రకటించాయి. ఆ అక్కసుతో పాకిస్తాన్ చేసిన కుటిల ప్రయత్నాలకు ఐరాసలో చెక్ పడింది.