అమెరికా సీక్రెట్ వెపన్.. హెల్ ఫైర్ ఆర్9ఎక్స్ స్పెషల్ ఏంది?

Update: 2022-08-03 04:40 GMT
ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా పేరుతో పాటు.. వందల కోట్ల రూపాయిల పారితోషికం అతడి తలకు కట్టిన అగ్రరాజ్యం.. ఎట్టకేలకు తాను అనుకున్నట్లే అతడ్ని లేపేసింది. అయితే.. ఈ సందర్భంగాఅమెరికా వాడిన ఆయుధం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఎలాంటి పేలుడు చోటు చేసుకోకుండా.. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు ఎలాంటి హాని కలిగించకుండా.. తమ టార్గెట్ అయిన జవహారీని మట్టుపెట్టిన చాకచక్యం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు తెర తీసింది. ఈ అత్యాధునిక క్షిపణిని హెల్ ఫైర్ ఆర్9ఎక్స్ గా చెబుతున్నారు. అగ్రరాజ్యం సీక్రెట్ వెపెన్ గా దీన్ని చెబుతున్నారు. ఇంతకీ ఈ అత్యాధునిక ఆయుధం కతేంటి? దాని విశేషాలేమిటి? అన్నది చూస్తే..

ఎవరినైనా టార్గెట్ చేసి.. చుట్టుపక్కల వారికి ఎలాంటి హాని కలిగించకుండా ఉండేందుకు సంధించే క్షిపణిగా దీన్ని చెబుతారు. ఈ క్షిపణికి మూలం ఏజీఎం 114 హెల్ ఫైర్. ఇది లేజర్ గైడెడ్ క్షిపణి. ఆకాశం నుంచి భూమి మీదకు దీన్ని ప్రయోగిస్తారు. ధ్వని కంటే తక్కువ వేగంతో ప్రయాణించే ఈ క్షిపణికి సంబంధించి అనేక వేరియంట్లు ఉన్నాయి. వాటిల్లో ఒకటి "హెల్ ఫైర్ ఆర్9ఎక్స్". దీని ప్రత్యేకత ఏమంటే.. పరిసరాలకు పెద్దగా నష్టం వాటిల్లకుండా చేయటం.. టార్గెట్ చేసిన వ్యక్తులను మాత్రమే ఏసేస్తుంది. ఈ క్షిపణి వ్యవస్థను ఒబామా హయాంలో డెవలప్ చేశారు.

కరుడుగట్టిన ఉగ్రనాయకుల్ని ఎలాంటి సిబ్బంది అవసరం లేకుండానే ఈ క్షిపణి సాయంతో హతమారుస్తారు. ఉగ్ర నేతల్ని ఏసేసుందుకు ఈ తరహా క్షిపణులను అమెరికా ప్రయోగిస్తోంది. తమ వద్ద ఉన్న ఆయుధాల్లో కొన్నింటి గురించి చెప్పినా.. హెల్ ఫైర్  ఆర్9 ఎక్స్ ఉన్న విషయాన్ని మాత్రం అగ్రరాజ్యం రివీల్ చేయలేదు. 2017లో తొలిసారి ఈ క్షిపణి కనిపించింది. సిరియాలో అల్ ఖైదా సీనియర్ నేత అబూ అల్ ఖయిర్ అల్ మస్రి ప్రయాణిస్తున్న కారు మీదకు దీన్ని ప్రయోగించారు.

ఆ సందర్భంలో ఈ క్షిపణి తీవ్రతకు కారు మీద పెద్ద రంధ్రం పడినట్లుగా చెబుతారు. దీని ప్రభావానికి అల్ మస్రీ తో పాటు కారులో ఉన్న వారంతా నుజ్జునుజ్జు అయ్యారని చెబుతారు. కానీ.. కారు ముందు భాగం.. వెనుక భాగం మాత్రం దెబ్బ తినకపోవటం చూస్తే.. ఈ అత్యాధునిక క్షిపణి.. ఎంతటి శక్తివంతమైనదో ఇట్టే చెప్పొచ్చు. అలా ప్రపంచానికి తనదగ్గర ఉన్న సరికొత్త క్షిపణి వ్యవస్థ గురించి ప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాత కాలంలోనూ వీటిని వాడినా.. అవన్నీ ప్రత్యేక సందర్భాలేనని చెబుతారు.

దాదాపు ఐదు అడుగులు.. 45 కేజీల బరువుతో ఉండే ఈ క్షిపణిని డ్రోన్లు.. హెలికాఫ్టర్లు.. విమానాలు.. హమ్వీ వాహనాలతో ప్రయోగించే వీలుంది. 500 మీటర్ల నుంచి 11 కిలోమీటర్ల రేంజ్ వరకు దీన్ని ప్రయోగించే వీలుంది.

హెల్ ఫైర్ ఆర్9ఎక్స్ క్షిపణిలో వార్ హెడ్ ఏమీ ఉండదు.కానీ.. క్షిపణి ముందు భాగంలో పదునైన కత్తులు లాంటి బ్లేడ్లు ఉంటాయి. లక్ష్యం సమీపానికి వెళ్లగానే.. ఈ బేడ్లు విచ్చుకొని ఒక్కసారిగా లక్షిత వ్యక్తుల్ని టార్గెట్ చేసి.. శరీరాన్ని ఛిద్రం చేసేస్తాయి. తద్వారా తాము అనుకుంటున్న పనిని పూర్తి చేస్తాయి.
Tags:    

Similar News