భారత్ పై నిత్యం విషం చిమ్మడమే కాకుండా... అవకాశం చిక్కితే భారత భూభాగంపై అల్లకల్లోలం సృష్టిస్తున్న దాయాదీ దేశం పాకిస్థాన్ కు ఉగ్రవాదులతో ప్రత్యక్ష సంబంధాలున్నాయన్న మాట మరోమారు రుజువైపోయింది. పాక్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద సంస్థలను ఏరివేసేందుకు ఆ దేశానికి ఇతోదికంగా ఆర్థిక సాయం చేస్తున్న అగ్రరాజ్యం అమెరికానే ఈ విషయాన్ని నిగ్గు తేల్చేసింది. అంతర్జాతీయ వేదికలపై భారత ప్రతిష్ఠను మంటగిలిపేందుకు పాక్ చేస్తున్న పన్నాగాలు కొనసాగుతున్న తరుణంలో అమెరికా చేసిన తాజా ప్రకటన ఆ దేశానికి నిజంగానే చెంపపెట్టేనని చెప్పక తప్పదు.
ఇక అసలు విషయంలోకి వస్తే... పాక్ నిఘా సంస్థ ఐఎస్ ఐకు ఉగ్రవాద సంస్థలతో నేరుగా సంబంధాలున్నాయని, ఇందులో తమకు ఏమాత్రం అనుమానం లేదని అమెరికా స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్స్ చైర్మన్ జనరల్ జోసెఫ్ డన్ ఫోర్డ్ సంచలన వ్యాఖ్య చేశారు. విదేశాంగ వ్యవహారాల కమిటీ సమావేశం అయిన సందర్భంగా సెనేటర్ జో డోన్ లీ అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా స్పందించారు. భారత్ - అప్ఘనిస్థాన్ ఎప్పటి నుంచో పాక్ కు చెందిన ఐఎస్ ఐను ఉగ్రవాదులతో సంబంధం ముడిపెడుతున్నాయని, మీరు కూడా ఆ విషయాన్ని నమ్ముతున్నారా అని జో ప్రశ్నించగా... డోన్‌లీ స్పందిస్తూ 'ఉగ్రవాద గ్రూపులతో ఐఎస్‌ఐకు సంబంధాలు ఉన్నాయనే విషయం స్పష్టం' అని నిర్మొహమాటంగా చెప్పేశారు. గతంలోనే పాక్ వైఖరిని మార్చేందుకు పలుమార్లు ప్రయత్నించామని, అయినప్పటికీ పాక్ ప్రభుత్వ పెద్దలు ఒక మాదిరిగా ఐఎస్ ఐ మరో తీరుగా పనిచేస్తుందని చెప్పారు.
ఐఎస్ ఐకి ప్రత్యేక విదేశాంగ విధానం ఉందని కూడా ఆయన ఆరోపించారు. పాకిస్థాన్ ను మార్చేందుకు మరో మార్గం ఉందని తాను అనుకోవడం లేదని చెప్పారు. ఇప్పటికే ఎన్నోసార్లు ప్రయత్నించామని, సరిగ్గా పరిశీలిస్తే పాక్ ప్రభుత్వమే స్వయంగా ఉగ్రవాదులను వదిలిపెట్టిన సంఘటనలు కూడా ఎన్నో చూస్తామని తెలిపారు. 'పాకిస్థాన్ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని పడగొడతామని చెబుతుంది. కానీ, ఐఎస్ ఐ మాత్రం సొంత విదేశాంగ విధానంతో ముందుకెళ్లడం మనం చూస్తాం' అని ఆయన కుండబద్దలు కొట్టేశారు. మరి ఈ విషయంపై పాక్ ఎలా స్పందిస్తుందో చూడాలి.