అమెరికా అధ్య‌క్షుడి పేరుతో ఓ గ్రామం..ఎందుకుందో తెలుసా?

Update: 2020-02-26 02:30 GMT
వివాదాల ప్రియుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ భారత్‌ లో తొలిసారిగా అడుగు పెట్టిన సంద‌ర్భంగా ప‌లు ఆస‌క్తిక‌ర అంశాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేశారు. భారత్‌ లో ఇప్పటి వరకు ఆరుగురు అమెరికా అధ్యక్షులు పర్యటించగా ట్రంప్‌ ఏడవ అధ్యక్షుడిగా నిలిచారు. ట్రంప్‌ న‌కు సంబందించిన అంశాలు అలా ప‌క్క‌న‌పెడితే...ఓ అధ్య‌క్షుడి పేరుతో మ‌న‌దేశంలో ఓ గ్రామం ఉండ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆయ‌నే అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్.

జిమ్మీ కార్టర్ పేరుతో హర్యానాలోని గురుగ్రామ్ (గుర్గావ్) స‌మీపంలో‘ కార్టర్‌పురి’ అనే గ్రామం ఉంది. ఈ పేరు పెట్ట‌డానికి ప‌లు ఆస‌క్తిక‌ర కార‌ణాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప‌రిపాల‌న‌లో అప్ప‌టి ప్ర‌ధాన‌మంత్రి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన‌ అనంతరం ప్రధాని మొరార్జీ దేశాయ్‌ నేతృత్వంలో తొలి కాంగ్రెసేతర జనతా ప్రభుత్వం ఏర్పడింది. ఈ స‌ర్కారు తర్వాత కొద్ది రోజులకే జిమ్మీ కార్టర్‌ భారత్‌ లో పర్యటించారు.1971 బంగ్లాదేశ్‌ యుద్ధం - 1974లో అణు పరీక్షల నేపథ్యంలో దెబ్బతిన్న సంబంధాల పునరుద్ధరణ లక్ష్యంగా ఆయన పర్యటన సాగింది.  1978 జనవరి 3న  అమెరికా మాజీ అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ తన భార్య రోసాలిన్ కార్టర్ తో ఢిల్లీకి దగ్గరలో ఉన్న ‘దౌలత్పూర్ నసీరాబాద్’ అనే పల్లెటూరుకి జిమ్మీ కార్డర్ వెళ్లారు. ఢిల్లీ సమీప గ్రామాన్ని సందర్శించగా అనంతరం ఆ గ్రామానికి ఆయన పేరుపెట్టారు.

అయితే, కేవ‌లం త‌మ గ్రామానికి వ‌చ్చినంత మాత్రానే ఆ గ్రామ‌స్తులు పేరు పెట్టేయ‌లేదు. 1960  ‘ఆర్మీ కోర్’ మెంబర్ గా అంటే ఒక సామాజిక కార్యకర్తగా జిమ్మీ కార్టర్ తల్లి  లిలియన్ గోర్డి కార్టర్ దౌల‌త్‌ పూర్ న‌సీరాబాద్ ఊరికి వచ్చార‌ట‌. కొద్దికాలానికి కార్ట‌ర్ వ‌చ్చారు. ఆ గ్రామంలో ప‌ర్య‌టించి ఫిదా అయిపోయారు. ఆ గ్రామానికి ఒక టెలివిజన్ సెట్ ను కార్టర్ దంపతులు కానుకగా ఇచ్చారు. అనంత‌రం ఆ గ్రామానికి ‘ కార్టర్‌ పురి’ అనే పేరు పెట్టారు. త‌మ‌కు ద‌క్కిన ఆద‌ర‌ణ గురించి కార్ట‌ర్ దంప‌తులు లేఖ ద్వారా పంచుకుంటూ, నా మొత్తం విదేశీ ప్రయాణంలో మీ గ్రామాన్ని సందర్శించిన సందర్బం మరచిపోలేది అంటూ జిమ్మీ కార్టర్ - అమెరికా ప్రథమ మహిళ రోసాలిన్ కార్టర్ లేఖలో పేర్కొన్నారు. ``మీ గ్రామాన్ని సందర్శించినప్పుడు గ్రామ ప్రజలంతా నాకు అందించిన ఆత్మీయ ఆతిథ్యం మరచిపోలేనిది. మీరు చూపించిన ప్రేమాభిమానాలు..స్నేహం ఆత్మీతయ మరచిపోలేదు. ఇంతటి మంచి మనస్సులు కలిగిన మిమ్మల్ని కలుసుకోవటం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.`` అంటూ సంతోషం వ్య‌క్తం చేశారు.


Tags:    

Similar News