40 ఏళ్ల సెంటిమెంట్: ఈసారి అమెరికా ప్రెసిడెంట్ అతడే?

Update: 2020-08-14 06:42 GMT
ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎవరు గెలుస్తారనేది అందరిలోనూ ఉత్కంఠ. జోరుగా పందాలు కాస్తుంటారు. జ్యోతిష్యులకు బాగానే పని లభిస్తుంది.. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది ఎప్పుడూ ప్రత్యేకమే.. ఈ క్రమంలోనే అప్పట్లో ‘అక్టోపస్’ జోస్యం చాలా పాపులర్ గా మారింది. ఆ తర్వాత డాల్ఫిన్ జోస్యాలు.. పాములు - కప్పలు ఇలా చాలా రకాల జోస్యాలు ప్రపంచవ్యాప్తంగా విజేతలను నిర్ణయించారు. చాలా కరెక్ట్ అయ్యాయి కూడా.

అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తున్నది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ నా? లేక డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ నా? అనేది ఉత్కంఠగా మారింది. ఇద్దరూ గెలుపు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

కాగా గత 40 ఏళ్లుగా ఆ ప్రొఫెసర్ చెప్పిన వ్యక్తినే అమెరికా అధ్యక్షుడవుతున్నాడు. అమెరికన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అలన్ లిచ్ట్మాన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తున్నారో ఖచ్చితంగా అంచనా వేస్తున్నారు.

గడిచిన 2016 ఎన్నికల సమయంలోనూ హిల్లరీ క్లింటన్ ఓడిపోయి ట్రంప్ గెలుస్తాడని ఈ ప్రొఫెసర్ ఖచ్చితంగా అంచనావేశారు. అంతకుముందు కూడా ఒబామా - జార్జి డబ్ల్యూ బుష్ - బిల్ క్లింటన్ లను ఈయన గెలుస్తాడని చెప్పాడు.

ఇప్పుడు కూడా ఈసారి నవంబర్ లో జరిగే ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ పై డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జోబిడెన్ విజయం సాధించనున్నట్లు ప్రొఫెసర్ అలన్ లిచ్ట్మాన్ ప్రకటించారు. దీంతో రిపబ్లికన్ పార్టీ నేతల్లో కలవరం మొదలు కాగా.. డెమొక్రాట్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News