అవెంజర్స్ సిరీస్ లో చాలా సినిమాలు వచ్చాయి. అయితే వాటన్నింటికి ఉన్న క్రేజ్ కంటే.. చివరి పార్ట్ అయిన అవెంజర్స్ ఎండ్ గేమ్ కు మాత్రం ఎక్కడా లేని క్రేజ్ వచ్చేసింది. అందరు సూపర్ హీరోస్ కలిసి థానోస్ ని ఎలా అంతం చేశారు అనే కాన్సెప్ట్ తో రూపొందించిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా రిలీజ్ దెబ్బకు మన ఇండియన్ సినిమాలు చాలా వాయిదాపడ్డాయంటే అవెంజర్స్ ఎండ్ గేమ్ ఫీవర్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు ఏ ఇద్దరు మాట్లాడుకున్నా అవెంజర్స్ గురించే. సినిమా ఎలా ఉంది, కలెక్షన్స్ ఎంత - అవతార్ బావుందా - అవెంజర్స్ బావుందా అనే చర్చే జరుగుతోంది. అసలు ఇది పొలిటికల్ సీజన్ కావడంతో.. రాజకీయ నాయకులు కూడా అవెంజర్స్ థీమ్‌ని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్.. అవెంజర్స్ ఎండ్ గేమ్ ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. గత ఐదేళ్లుగా బీజేపీ అన్ని వర్గాలను మోసం చేసింది. ఇప్పడు వారి ఎండ్‌గేమ్‌కు టైమ్ వచ్చింది అంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా.. రాబోయే రోజుల్లో దేశంలో మహాకూటమి అధికారంలోకి రాబోతుందని ప్రకటించారు.
ఇక ప్రెస్ ఇన్ పర్మేషన్ బ్యూరో కూడా అవెంజర్స్ థీమ్ ని బాగానే వంటబట్టించుకుంది. భారత సమాచార శాఖలో కీలకమైన ప్రెస్ బ్యూరో.. అవెంజర్స్ థీమ్ ని ఉపయోగించుకుని ఓటు ప్రాముఖ్యాన్ని తెలిపేందుకు ప్రయత్నించింది. అవెంజర్స్ లో నటించిన సూపర్ హీరోలంతా ఓటుతో మీ జీవితాన్ని బాగుచేయండి - దేశాన్ని బాగుచేయండి అనే అర్థం వచ్చేలా క్యాప్షన్స్ - థీమ్స్ ని రూపొందించింది. మొత్తానికి అవెంజర్స్ ఫీవర్ మనవాళ్లకు బాగా ఎక్కేసింది. ఇప్పటికే రిలీజ్ అయిన సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను కొల్లగొడుతుంది.