ఆదేశించినంతనే దూసుకెళ్లి మరీ.. చేయాల్సిన పనిని సంపూర్ణంగా చేసి వచ్చే బీజేపీ కీలక నేత మురళీధర్ రావుకు ఊహించని పరిణామం ఎదురైంది. గడిచిన నాలుగు రోజులుగా కర్ణాటకలో మకాం వేసి.. ఆపరేషన్ కమలాన్ని పూర్తి చేయాలని భావించిన ఆయనకు దిమ్మ తిరిగే క్లాస్ పడింది. అమిత్ షాకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న మురళీధర్ రావుకు.. అదే షా తాజాగా భారీ క్లాస్ పీకినట్లుగా చెబుతున్నారు.
కర్ణాటక సంక్షోభం నేపథ్యంలో రెబల్ ఎమ్మెల్యేల్ని పార్టీలోకి విజయవంతంగా తీసుకొచ్చిన నేపథ్యంలో.. కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టటం.. ఆపై కమలనాథుల వశం చేసుకోవాల్సిన వేళ.. అందుకు భిన్నంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న వైనంపై మోడీషాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి అత్యంత సన్నిహితుడైన మహేశ్ తో మురళీధర్ రావు చర్చలు జరిపిన వైనంపై అమిత్ షా కోపంతో ఉన్నట్లు చెబుతున్నారు. చేయమన్న పనేంటి? చేసిందేమిటి? అంటూ దాదాపు 20నిమిషాల పాటు భారీ క్లాస్ పడినట్లుగా తెలుస్తోంది.
కుమారస్వామికి సన్నిహితులైన మహేశ్ తో ఈశ్వరప్ప.. మురళీధర్ రావులు కలిసి జరిపిన రహస్య చర్చల వివరాలు అమిత్ షా దృష్టికి వెళ్లటం.. దానిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. తక్షణమే కర్ణాటకనువదిలేసి వెనక్కి వచ్చేయాలని మురళీధర్ రావుకు హుకుం జారీ చేసినట్లుగా సమాచారం. దీంతో.. నిన్నటి వరకూ బెంగళూరులోనే ఉన్న మురళీధర్ రావు తాజాగా హైదరాబాద్‌కు తిరిగి వచ్చేయటం గమనార్హం. మహేశ్ తో తాను ఎలాంటి రహస్య చర్చలు జరపలేదని అమిత్ షాకు వివరణ ఇచ్చినట్లుగా చెబుతున్నా.. ఆయన మాత్రం సంతృప్తి చెందలేదని చెబుతున్నారు. అమిత్ షాతో మురళీధర్ రావు ఫోన్ సంభాషణ 20 నిమిషాల పాటు సాగినట్లుగా తెలుస్తోంది. వ్యవహారం తేడా వస్తే ఎంత సన్నిహితుడితోనైనా ఎంత కరకుగా షా వ్యవహరిస్తారనటానికి తాజా ఉదంతం చక్కటి ఉదాహరణగా చెబుతున్నారు.