నెహ్రూ మీద అమిత్ షా సంచలన విమర్శలు

Update: 2016-06-29 16:22 GMT
భారత తొలి ప్రధానమంత్రి.. చాచా నెహ్రూపై బీజేపీ చీఫ్ అమిత్ షా సంచలన విమర్శలు చేశారు. ఆయన చేసిన చారిత్రిక తప్పిదం దేశంలోని మరే జాతీయ నేత కూడా చేయలేదన్నారు. నెహ్రూ తీసుకున్న నిర్ణయాలు.. ప్రకటనలు ఎందుకు చేశారన్నది ఎవరికి అర్థం కానివిగా ఆయన వ్యాఖ్యానించారు. కశ్మీర్ విషయంలో ఆయన చాలా పెద్ద తప్పు చేశారంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన అమిత్ సా.. కశ్మీర్ వ్యవహారంలో నెహ్రూది చారిత్రక తప్పిదంగా తేల్చేశారు.

1948లోభారత – పాకిస్థాన్ మధ్య కాశ్మీర్ అంశంలో సంధి ప్రకటించటం ఏమిటన్న ఆయన.. ‘‘ఎందుకు సంధికి సంబంధించిన ప్రకటన చేశారో ఎవరికి తెలీదు. అప్పుడు నెహ్రూ కాల్పుల విరమణ ప్రకటించి ఉండకపోతే.. ఇప్పుడు కశ్మీర్ అంశంలో వివాదమే ఉండేది కాదు. కేవలం వ్యక్తిగత ప్రతిష్ఠ కోసమే నెహ్రూ సంధి నిర్ణయాన్ని తీసుకొని ఉంటారు.ఈ కారణం వల్లే కశ్మీర్ లో కొంత భాగం ఇప్పుడు పాకిస్థాన్ అధీనంలో ఉంది’’ అని వ్యాఖ్యానించారు. నెహ్రూ ఇమేజ్ ను తీవ్రంగా ప్రభావితం చేసేలా ఉన్న అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ ముఖ్యనేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News