ప్రధాని నరేంద్ర మోడీపై ఆయనకు అంత్యంత ఇష్టమైన నాయకుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పుస్తకం రాశారు. మోడీ గురించి.. గతంలోనూ.. ప్రస్తుతం అమిత్ షా రాసిన వందల సంఖ్యలో వ్యాసాలను గుదిగుచ్చి.. పుస్తకం తీసుకువచ్చారు. షాతోపాటు.. మరికొందరు మోడీని ఆకాశానికి ఎత్తేస్తూ.. రాసిన వ్యాసాలను కూడా దీనిపై ప్రచురించారు. అదే.. Modi @ 20: Dreams Meet Delivery పుస్తకం. ఈ పుస్తకావిష్కరణ బుధవారం ఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. రాబోయే మరో 25 సంవత్సరాలు.. ఈదేశానికి మోడీనే ప్రధానిగా ఉంటారని చెప్పారు.
దేశ సర్వతోముఖాభివృద్ధికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వం వహిస్తున్నారని అమిత్ షా చెప్పారు. మోడీ నాయ కత్వంపై ప్రజలకు గట్టి నమ్మకం ఉందని, వారు తమ మనసు లోతుల నుంచి మోడీని ప్రేమిస్తున్నారని తెలిపారు. మోడీ నాయకత్వంపై భారతీయులకు గొప్ప నమ్మకం ఉందని, వారు తమ మనసు లోతుల నుంచి ఆయనను ప్రేమిస్తున్నారని చెప్పారు. ఆయన ఎటువంటి కుటుంబ నేపథ్యం లేకుండానే దేశ నాయకునిగా ఎదిగారని, ఇది చాలా ముఖ్యమైన విషయమని తెలిపారు. ఆయన నాయకత్వంలో బీజేపీ అన్ని ప్రాంతాలకు విస్తరించిందన్నారు.
అంతేకాకుండా పార్టీపై ప్రచారమైన అనేక ప్రతికూల అంశాలు పటాపంచలయ్యాయన్నారు. బీజేపీ అంటే హిందీ మాట్లాడేవారి పార్టీ అని, కేవలం పట్టణ ప్రాంతాల్లోనే దీనికి పలుకుబడి ఉందని, రైతుల పార్టీ కాదని జరిగిన ప్రచారాలను ఆయన నాయకత్వం లో తిప్పికొట్టగలిగినట్లు షా తెలిపారు. మోడీ ప్రభుత్వం ప్రజలు ఇష్టపడటం కోసం కాకుండా, వారికి శ్రేయస్సు కలిగించే నిర్ణయాలను ఎటువంటి రాజకీయ ఆలోచనలు లేకుండా తీసుకుంటుందని చెప్పారు.
అద్భుతాలు, కుటుంబ నేపథ్యం, రాజకీయ ప్రాపకం వంటివేవీ లేకుండానే 2014లో మోడీకి భారీ స్థాయిలో ప్రజా తీర్పు వచ్చిందంటూ.. పరోక్షంగా కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. 2019లో మరోసారి ప్రజాతీర్పు వచ్చిందన్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయమని తెలిపారు. మోడీని తమ నాయకునిగా ప్రజలు ఆమోదించారని దీనిని బట్టి స్పష్టమవుతోందన్నారు. వారు ఆయనను తమ మనసు లోతుల నుంచి ప్రేమిస్తున్నట్లు వెల్లడవుతోందన్నారు. ఆయన ప్రజల నమ్మకాన్ని సాధించారని చెప్పారు. అందుకే.. వచ్చే 25 సంవత్సరాల పాటు.. ప్రధానిగా మోడీనే ఉంటారని అన్నారు.
అటు పార్టీ కోసం, ఇటు ప్రభుత్వం కోసం సమాన స్థాయిలో గొప్ప అంకితభావంతో పని చేస్తున్న ఏకైక నేత మోడీయేనని అమిత్ షా తెలిపారు. ఆయన నాయకత్వంలో బీజేపీ ప్రపంచంలో అతి పెద్ద పార్టీగా, అత్యధిక రాష్ట్రాల్లో పని చేస్తున్న పార్టీగా ఎదిగినట్లు తెలిపారు.
Modi @ 20: Dreams Meet Delivery పుస్తకాన్ని బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ సంకలనం చేసింది. నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధాన మంత్రిగా 20 ఏళ్ళ నుంచి అమలు చేస్తున్న పరిపాలన విధానాన్ని ఈ పుస్తకంలో వివరించారు. అమిత్ షా, అజిత్ దోవల్, సుధా మూర్తి, నందన్ నీలేకని, అరవింద్ పనగారియా, సుబ్రహ్మణ్యం జైశంకర్, లతా మంగేష్కర్, పీవీ సింధు, నృపేంద్ర మిశ్రా వంటివారు రాసిన వ్యాసాలను దీనిలో పొందుపరిచారు. పుస్తకం ఖరీదును 550 రూపాయలుగా నిర్ణయించారు.