ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవలి కాలంలో సందేహాస్పదంగా మారిన టీడీపీ-బీజేపీ మైత్రి విషయంలో కీలక ముందడుగు పడింది. తమ దారి తాము అన్నట్లుగా సాగుతున్న ఈ రెండు నేతల మధ్య పరిస్థితిని చక్కదిద్దేందుకు సాక్షాత్తు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు అమిత్ షా ఫోన్ చేశారు. పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగిన అనతరం ఈ ఫోన్ వచ్చినట్లు తెలుస్తోంది. విభజన హామీలపై ఈనెల 5న చర్చిద్దామన్న బీజేపీ చీఫ్ చంద్రబాబుతో చెప్పినట్లు సమాచారం.
అమిత్ షాతో ఫోన్ చర్చలో టీడీపీ అధినేత చంద్రబాబు తమ అభిప్రాయాలను పంచుకోవడంతో పాటుగా వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీ చేసే పోరాటంపై అపోహలు వద్దని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. తమ పోరాటం ప్రజల కోసమేనని, అలాగే విభజన హామీలపై కూడా పోరాటం చేస్తున్నామని, అంతేతప్ప బీజేపీ లక్ష్యంగా తమ పోరాటం కొనసాగడం లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరణ ఇచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో పార్లమెంట్ వేదికగా ఇచ్చిన హామీల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమని సీఎం చంద్రబాబు నాయుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో అన్నారని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, చంద్రబాబు అభిప్రాయాలను విన్న అమిత్ షా విభజన హామీలపై ఈనెల 5వతేదీన చర్చిద్దామని అమిత్ షా సీఎం చంద్రబాబుతో చెప్పారు. దీంతో తమ ప్రతినిధిగా కేంద్ర మంత్రి సుజనాచౌదరి బృందాన్ని చర్చలకు పంపుతానని సీఎం చంద్రబాబు అమిత్ షాకు తెలిపారు.
ఇదిలాఉండగా....ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో జరిగిన చర్చలు నిరుత్సాహ పరిచాయన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పినట్లుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఫార్ములా రాలేదన్నారు. అమిత్ షా నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాలేదని అన్నారు. ఏదైనా ఫార్ములా చెప్పాలని మమ్మల్నే అడుగుతున్నారని అన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నప్పుడు ఫార్ములాలు ఏముంటాయని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.