షా డైరెక్ష‌న్‌.. ప‌వ‌న్ - చంద్ర‌బాబు యాక్ష‌న్‌...!

Update: 2023-01-11 12:30 GMT
ఏపీకి కేంద్ర మంత్రి..బీజేపీ నాయ‌కులు అమిత్ షా రానున్నారు. వాస్త‌వానికి షెడ్యూల్ ప్ర‌కారం.. 8న రావా ల్సి ఉండ‌గా.. ఇది సంక్రాతి త‌ర్వాత‌కు వాయిదా ప‌డింది. అయితే.. ఇప్ప‌టికే షా రాక‌పై అనేక చ‌ర్చోప‌చ ర్చలు జ‌రుగుతున్నాయి. ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయాలు కూడా వేడెక్కాయి. నిజానికి కేంద్రంలోని బీజేపీ సూచ‌న‌ల మేర‌కే.. ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. టీడీపీ అధినేత‌ను క‌లుసుకున్నార‌ని మ‌రో వాద‌న తెరమీదికి వ‌చ్చింది.

అంటే.. ఇదంతా కూడాఅమిత్ షా వ్యూహం ప్ర‌కార‌మే జ‌రుగుతోంద‌నే వాద‌న వినిపిస్తోంది. మొత్తంగా.. రాజ‌కీయాల్లో ఇప్పుడు వ‌చ్చిన ఊపు.. బీజేపీ క‌నుస‌న్న‌ల్లోనే జ‌రుగుతోంద‌ని మేదావులు కూడా అంటున్నా రు. అయితే.. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిణామాల‌ను వైసీపీ పాల‌న‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్న షా.. అండ్ బీజేపీ పెద్ద‌లు.. అవ‌కాశం.. అవ‌స‌రం కోసం ఎదురు చూస్తున్న‌ట్టు తెలుస్తోంది.

నిజానికి వైసీపీ క‌నుక‌.. ఏమాత్రం మెత్త‌బ‌డుతున్న సంకేతాలు అందినా.. వెంట‌నే బీజేపీ టీడీపీతో పొత్తుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తుంద‌నే ప్ర‌చారం ఉంది మ‌రోవైపు.. టీడీపీ పుంజుకుంటున్న సంకేతాలు ఇప్ప‌టికే బీజేపీ పెద్ద‌ల‌కు చంద్ర‌బాబు స్వ‌యంగా వివ‌రించారని ఢిల్లీలోని టీడీపీ నాయ‌కులు అంటున్నారు. ఆయ‌న ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డం.. ప్ర‌జ‌లు భారీ సంఖ్య‌లో హాజ‌ర‌వ‌డం.. వంటి విష‌యాల‌ను వివ‌రించిన‌ట్టు చెబుతున్నా రు.

ఈ క్ర‌మంలో వైసీపీ దూకుడు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆపార్టీపై ప్ర‌జ‌ల‌కు ఉన్న అభిప్రాయం వంటివాటిని నిశితంగా గ‌మ‌నిస్తున్న బీజేపీ పెద్ద‌లు.. దీనిపై పెద‌వి విప్ప‌డం లేదు. వ‌చ్చే ఎన్నికల్లో కేంద్రంలో త‌మ‌కు స‌హ‌క‌రించేవారు.. రాష్ట్రంలో త‌మ‌కు ద‌న్నుగా నిలిచేవారు ఇప్పుడు ఏపీలో అవ‌స‌రం.  ఈ వ్యూహం ప్ర‌కార‌మే అడుగులు ప‌డుతున్నాయ‌ని.. ప‌వ‌న్‌-చంద్ర‌బాబు భేటీ వెనుక కూడా ఇదే వ్యూహం ఉంద‌ని ఢిల్లీ వ‌ర్గాలు చెబుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News