బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ మధ్యన పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. తానే రాష్ట్రానికి వెళ్లినా సరే.. దళితులు.. గిరిజనుల ఇళ్లు ఎక్కడ ఉంటాయో చూసుకొని మరీ.. వారి ఇళ్లకు భోజనానికి వాలిపోతున్నారు. ఈ మధ్యన ఉద్యమ తరహాలో దళితులు.. గిరిజనుల ఇళ్లల్లో భోజనాల వ్యవహారాన్ని ఆయన చేపట్టారు. దేశ వ్యాప్తంగా ఉన్న దళితుల్ని.. గిరిజన్నుల్ని బీజేపీ దగ్గర చేసేందుకు చేపట్టిన అనేక కార్యక్రమాల్లో ఈ భోజన కార్యక్రమం ఒకటిగా చెబుతుంటారు.
మిగిలిన రాజకీయం ముచ్చట ఎలా ఉన్నా.. అమిత్ షా కానీ ఇంటికి భోజనానికి వస్తే మాత్రం సీన్ మొత్తం మారిపోతుందని చెబుతున్నారు. ఏ ఇంటికి భోజనానికి వెళుతున్నారో.. ఆ ఇంటివాళ్లకు కొత్తగా పేరు ప్రఖ్యాతులు మాత్రమే కాదు.. కనీస సౌకర్యాల్ని ఆయన రావటానికి ముందే ఇచ్చేస్తున్నారు. తాజాగా అలాంటి విషయమే బయటకు వచ్చింది. నిన్నటికి నిన్న అమిత్ షా గుజరాత్ లోని ఛోటా ఉదేపూర్ లో పర్యటించారు. మరికొద్ది నెలల్లో గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గడిచిన కొన్నేళ్లుగా నిరాటంకంగా పాలిస్తున్న బీజేపీ పాలక పక్షానికి రాష్ట్రంలో ఒకింత ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిందన్న మాట వినిపిస్తోంది. దీంతో.. తమ ఇంటి రాష్ట్రమైన గుజరాత్ మీద ప్రత్యేక ఫోకస్ పెట్టే పనిలో పడ్డారు అమిత్ షా.
ఇందులో భాగంగా ఆయన ఒక గిరిజనుడి ఇంటికి వెళ్లి.. వారింట్లో నేలపై కూర్చొని భోజనం చేశారు. అంతే.. షా దెబ్బకు సదరు గిరిజనుడి ఇల్లు ఇప్పుడు పాపులర్ అయిపోయింది. అంతేనా.. అమిత్ షా వస్తున్నారు కాబట్టి.. ఆయన రావటానికి నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్లు మొదలు పెట్టేశారట. సదరు గిరిజనుడి ఇంటికి కొత్త కూలర్.. గ్యాస్ స్టవ్.. వాష్ బేసిన్.. టాయిలెట్ లను ఏర్పాటు చేశారు. అమిత్ షా భోజన కార్యక్రమం పూర్తి అయిన తర్వాత కూడా తీసుకొచ్చిన వస్తువుల్ని తీసుకెళ్లకుండా అట్టే ఉంచేయటంతో.. సదరు గిరిజనుడి ఇంట్లోనూ ఆనందం వ్యక్తమవుతున్నట్లు చెబుతున్నారు. నెల కిందట వరకూ సాదాసీదాగా ఉన్న ఇల్లు కాస్తా.. ఇప్పుడు అన్ని వసతులు వచ్చేయటం చూసినప్పుడు.. అమిత్ షా ఇంటికి వస్తే కలిగే లాభాలెన్నో అన్న భావన కలగటం ఖాయం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/