నిన్నటి వరకూ తమ మాటలకు ఓకే అంటున్న చంద్రబాబు.. ఉన్నట్లుండి మాట మార్చటంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హోదాకు బదులుగా ప్యాకేజీకి ఓకే అన్న చంద్రబాబు ఇప్పుడు అందుకు భిన్నంగా హోదాపై యూటర్న్ తీసుకోవటం.. తన మంత్రుల్ని ఉపసంహరించుకోవటం.. ఆ వెంటనే ఎన్డీయే నుంచి వైదొలగటం తెలిసిందే.
ఈ పరిణామాల నేపథ్యంలో బాబుకు అమిత్ షా భారీ కౌంటర్ ను ఇచ్చారు. రాజకీయ దురుద్దేశంతోనే కూటమి నుంచి బయటకు వచ్చినట్లుగా వ్యాఖ్యానించారు. ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతున్నట్లుగా లేఖ రాసిన బాబు.. ఈ సందర్భంగా బీజేపీపై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో బాబుకు కౌంటర్ ఇచ్చేలా అమిత్ షా ఘాటు లేఖ ఒకటి పంపారు.
మొత్తం తొమ్మిది పేజీల లేఖ రాసిన అమిత్ షా.. ఇందులో బాబు తీరును తీవ్రంగా తప్పు పట్టటంతో పాటు.. అభివృద్ధి ఎజెండా కంటే రాజకీయ ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నట్లు మండిపడ్డారు. కూటమి నుంచి వైదొలిగేందుకు బాబు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్లు తప్పు పట్టారు.
ఏపీ అభివృద్ధి కోసం మోడీ సర్కారు అన్ని రకాలుగా సహకరించిందన్న ఆయన ఏపీ విభజన సమయంలో తెలుగు రాష్ట్రాల హక్కులను పరిరక్షించటంలో బీజేపీ ముందు ఉందన్నారు. చంద్రబాబు చెబుతున్న మాటలన్నీ అబద్ధాలన్న అమిత్ షా.. ఏపీకిచ్చే కేంద్ర సాయాన్ని ఎన్డీయే సర్కార్ రెండింతలు చేసిందన్నారు. బీజేపీ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదన్న ఆయన రాజధాని కోసం కేంద్రం విడుదల చేసిన నిధుల్లో కేవలం 8 శాతం మాత్రమే ఏపీ ఖర్చు చేసిందన్నారు.
పోలవరానికి సంబంధించి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్య చేశారు. పోలవరానికి రూ.364 కోట్ల కేటాయించినట్లు చంద్రబాబు చెప్పారని.. అయితే ప్రభుత్వం నుంచి జరిగిన తీవ్రమైన తప్పిదాలను ఎప్పటికి మర్చిపోలేమన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులకు సంబంధించి ఎలాంటి లెక్కలు ఇప్పటివరకూ బాబు ప్రభుత్వం సమర్పించలేదన్న ఆయన ప్రజల సొమ్ముకు సంబంధించి ప్రతి పైసాకు లెక్క చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
ఏపీకి సాయం అందించే విషయంలో మోడీ సర్కారు ఎక్కడా వెనక్కి తగ్గలేదన్న అమిత్ షా.. ఏపీకి.. టీడీపీకి బీజేపీ మంచి మిత్రుడిగా అభివర్ణించారు. రాష్ట్రంలో మూడు విమానాశ్రాయాలకు అంతర్జాతీయ విమానాశ్రయాలుగా తీర్చిదిద్దామని గుర్తు చేశారు. 2016-17లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇచ్చిన నిధుల్లో 12 వాతం మాత్రమే రాష్ట్రం ఖర్చు చేసిందన్న అమిత్ షా కేంద్రం ఏం ఇచ్చిందన్న విషయంపై వివరాల్ని లేఖలో ప్రస్తావించటం గమనార్హం.
తన భారీ లేఖలో అమిత్ షా పేర్కొన్న కీలకాంశాలు చూస్తే..
+ మొత్తం 8 ఇన్ ఫ్రా ప్రాజెక్టుల్లో ఐదింటి పని ప్రారంభమైంది
+ 180 కిలోమీటర్ల మేర అమరావతి చుట్టూ రింగ్ రోడ్ కు రూ.19,700 కోట్ల ఖర్చు కానుంది
+ విజయవాడ గుంటూరు వయా అమరావతి కొత్త రైల్వే లైన్ వ్యయం రూ.2680 కోట్లు
+ 2014 విభజన చట్టంలోని అంశాల అమలుకు నాలుగేళ్లలో చాలా నిధులిచ్చాం
+ 11 జాతీయ విద్యా సంస్థలను 2022లోగా ఏర్పాటు చేస్తాం
+ నడికుడి - శ్రీకాళహస్తి కొత్త రైల్వే లైన్ కి రూ.340 కోట్లు
+ గుంతకల్ - గుంటూరు లైన్ డబ్లింగ్ ప్రాజెక్టు వ్యయం రూ.3,631 కోట్లు
+ రూ.6,769 కోట్ల వ్యయయంతో విజయవాడ మెట్రో రైలుకు సూత్రప్రాయ అంగీకారం
+ విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం రివైజ్డ్ ప్రపోజల్ కోసం ఎదురుచూస్తున్నాం
+ దుగ్గరాజపట్నం పోర్టు - కడప స్టీల్ ప్లాంట్ మొదట్లో సాధ్యం కాదని రిపోర్ట్ వచ్చింది
+ కొత్త రైల్వే జోన్ అంశాన్నీ పరిశీలిస్తున్నాం
+ సెంట్రల్ యూనివర్సిటీ - ట్రైబల్ యూనివర్సిటీకి ఈ బడ్జెట్లోనే నిధులు కేటాయించాం
+ రూ.24 వేల కోట్లతో అమరావతి టు అనంతపూర్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వేకు రాష్ట్రం భూమి ఇవ్వాల్సి ఉంది
+ కొత్త రాజధాని కోసం రూ.2,500 కోట్లు ఇచ్చాం
+ పోలవరం ప్రాజెక్ట్ వ్యయం 2010-11 అంచనాలు రూ.16,010 కోట్లు. వీటిని కేంద్రమే ఇస్తుంది........