అమిత్ షా. బీజేపీకి విజయాల సారధి. ఆయన పక్కాగా ప్లాన్ చేస్తారు. అంతే పక్కాగా అమలు చేస్తారు. దెబ్బకు ప్రత్యర్ధి గింగిరాలు తిరగాల్సిందే. ఇదిలా ఉండగా అమిత్ షా కన్ను ఇపుడు సౌత్ మీద పడింది. అందునా తెలంగాణా మీద పూర్తిగా పడింది. దానికి కారణాలు అనేకం. తెలంగాణాలో బీజేపీ ఎంతో కొంత బలంగా ఉంది. అదే టైమ్ లో తెలంగాణాను ఇవ్వడానికి కారణమైన పార్టీగా తన రాజకీయ వాటాను ఎప్పటికపుడు జనాలలో క్లెయిం చేసుకుంటూ ఉంటుంది.
మరో వైపు చూస్తే కేసీయార్ ఇప్పటికి రెండు విడతలుగా అధికారాన్ని అందుకుని ఉన్నారు. ఈసారి గెలవడం అంటే అది అద్భుతమే అనుకోవాలి. బెంగాల్ లో మమతా బెనర్జీ ఆ అద్భుతాన్ని క్రియేట్ చేసింది. చాలా తక్కువ మంది రాజకీయ నాయకులకే హ్యాట్రిక్ విజయం దక్కుతుంది. కేసీయార్ కి ఆ లక్ ఉందో లేదో ఇప్పటి నుంచే ఎవరూ చెప్పలేరు కానీ మామూలుగా రాజకీయాలలో అయితే మూడవసారి విజయం అన్నది చాలా కష్టం.
ఈ లెక్కలు ఎటూ బీజేపీకి ఉన్నాయి. మరో వైపు చూస్తే కాంగ్రెస్ ఓడి ఏడేళ్లు గడుస్తున్నా గట్టిగా పుంజుకోలేకపోతోంది. ఆ పార్టీలో ఎన్నో వర్గాలు, బలం ఉన్నా కూడా వాడులోలేని పరిస్థితి, ఒకరిని మించిన వారు మరొకరు అన్నట్లుగా ఆ పార్టీలోని వారు అంతా అగ్ర నేతలే. అందరి మధ్యన ఆభిజాత్యాలే. దాంతో తెలంగాణాలో తామే టీయారెస్ కి అసలైన ఆల్టర్నేషన్ అని బీజేపీ గట్టిగా నమ్ముతోంది.
ఇంకో విషయం ఏంటి అంటే బీజేపీకి ఈసారి సౌత్ చాలా ముఖ్యం. లైట్ గా తీసుకోవాల్సిన సీన్ కూడా లేదు. నార్త్ సైడ్ సీట్లు తగ్గితే భర్తీ చేసుకోవాల్సింది ఇక్కడే. దాంతో కాస్తో కూస్తో బలమున్న చోటనే బీజేపీ గర్జించాలనుకుంటోంది. కష్టపడితే తెలంగాణాలో గెలిచేస్తామని బీజేపీ పెద్దలు భావించడం వెనక ఉన్న అంతరార్ధం కూడా అదే.
మొత్తానికి తెలంగాణాకు చెందిన కీలకమైన నేతలను తెప్పించుకుని మరీ అమిత్ షా దిశా నిర్దేశం చేశారు. తెలంగాణాలో అగ్రెస్సివ్ మూడ్ లోనే వెళ్ళండి, కేసీయార్ సర్కార్ కి విపరీతమైన ప్రజావ్యతిరేకత ఉంది. దాన్ని సొమ్ము చేసుకోవాల్సిందే అంటూ అమిత్ షా చెప్పడం వెనక వ్యూహం ఎంతో ఉంది. కేసీయార్ తో యుద్ధానికి బీజేపీ అధినాయకత్వం చేయూత ఇస్తుందని, అదే సమయంలో తాను కూడా ఇక మీదట తెలంగాణాకె అధిక ప్రాధాన్యత ఇస్తానని కూడా అమిత్ షా అభయం ఇచ్చేశారు.
ఇక్కడ మరో మాట కూడా ఆయన అన్నారని టాక్. వచ్చే ఏడాది అంటే 2022లోనే తెలంగాణాలో ఎన్నికలు జరుగుతాయని పార్టీ శ్రేణులకు హితబోధ చేశారని తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం చూస్తే తెలంగాణాకు 2023లోనే ఎన్నికలు జరగాలి. కానీ దాని కంటే ఏడాది ముందే ఎన్నికలు పెట్టించుకుని మరోమారు అధికారాన్ని అందుకుందామని కేసీయార్ ఆలోచనలు చేస్తున్నారు అన్న సంగతిని బీజేపీ పెద్దలు పసిగట్టేశారు.
దాంతో ఈ ఏడాదిలోగా తెలంగాణాలో బీజేపీ అలుపెరగని పోరాటమే చేయాలని తాను కూడా పూర్తిగా అందుబాటులో ఉంటానని అమిత్ షా చెబుతున్నారు. మొత్తానికి కేసీయార్ విషయంలో బీజేపీ రూట్ మార్చింది. ఆయన మళ్లీ గెలిచినా తమకు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సహకరించరు అన్న సందేహాలు ఏవోవచ్చి ఉండాలి. అదే టైమ్ లో ఆయన్ని కంట్రోల్ లో పెట్టడానికైనా గట్టిగా బిగించాలన్న ఉద్దేశ్యాలు అయినా ఉండాలి.
ఏది ఎలా ఉన్నా తమకే పూర్తిగా రాజకీయ లాభం కలిగేలా బీజేపీ పక్కా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తోంది. దాంతో కేసీయార్ తో అమీ తుమీకే బీజేపీ రెడీ అవుతోంది. ఈ మొత్తం స్ట్రాటజీ వెనక అమిత్ షా ఉన్నారు. ఆయన ఎప్పటికపుడు సరికొత్త వ్యూహాలకు కూడా పదును పెడతారు. అంటే తెర ముందు ఎవరు ఉన్నా అమిత్ షాతోనే ఢీ కొట్టేందుకు గులాబీ పార్టీ రెడీ అయిపోవాల్సిందే అన్న మాట. మొత్తానికి లేటెస్ట్ గా బీజేపీ పెద్ద షా పెట్టిన మీటింగ్ గులాబీ గుండెల్లో గుబులు పుట్టించేదే అంటున్నారు.