మహరాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత.. రీసెంట్ గా ఓ మ్యూజిక్ వీడియో షూటింగ్ లో పాల్గొంది. అమితాబ్ బచ్చన్ తో కలిసి షూట్ చేసిన ఆ వీడియోలో అమృతా ఫడ్నవీస్ గ్లామరస్ డ్రస్సులో కనిపించింది. మరీ మితిమీరిన ఎక్స్ పోజింగ్ చేసేయకపోయినా.. తనను తాను గ్లామరస్ గా బాగానే ప్రెజెంట్ చేసుకుంది. ముఖ్యమంత్రి భార్య ఇలా చేయడం ఏంటంటూ ఇప్పటికే విమర్శలు పీక్ స్టేజ్ కి చేరిపోయాయి.
రీసెంట్ గా ఓ టీవీ ఛానల్ లైవ్ డిస్కషన్ లో అమృతపై తీవ్ర విమర్శలు చేశారు పొలిటీషియన్ అల్ నసీర్ జకారియా. దీనిపై సీఎం వైఫ్ కూడా ఘాటుగానే స్పందించింది. 'ఫిజియో థెరపిస్ట్ గా చేస్తున్న ముంబై యువతికి సంబంధించిన డిబేట్ జరుగుతుండగా నాపై కామెంట్స్ చేశారు. ఇందులో వారి పర్వర్టెడ్ మైండ్.. మురికి ఆలోచనలు బయటపడ్డాయి. నేనేం ధరించాలో చెప్పే హక్కు ఎవరికీ లేదు. మహిళగా.. తల్లిగా.. భార్యగా.. బ్యాంకర్ గా నేను అన్ని బాధ్యతలు ఎంతో చక్కగా చేస్తున్నాను. ఇప్పుడు నా వ్యక్తిగత గౌరవాన్ని నిలదీసే హక్కు ఎవరికీ లేదు' అంటూ మండిపడింది అమృత.
తాను రాజకీయాలకు సంబంధంలేని ఓ ప్లాట్ ఫాంపై అలా కనిపిస్తే నష్టం ఏంటని.. అది తన వ్యక్తిగతం అని అంటోంది సీఎం వైఫ్. భవిష్యత్తులో కూడా తనకు నచ్చిన పని చేస్తానని.. ఎవరైనా సరే తాము చేస్తున్నది సరైనదే అని మనస్ఫూర్తిగా ఆ పని చేసేయమని సూచిస్తానని చెబుతూ స్ఫూర్తిగా నిలుస్తోంది మహా సీఎం భార్య అమృతా ఫడ్నవీస్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/