సంచలనంగా మారిన మారుతిరావు ఆత్మహత్య ఉదంతంపై ఆయన కుమార్తె అమృత స్పందించారు. నల్గొండలోని ఆమె నివాసానికి వెళ్లిన మీడియాతో తొలుత మాట్లాడేందుకు నో చెప్పారు. అనంతరం ఒకట్రెండు మీడియా ప్రతినిధులతో ఆమె మాట్లాడారు. తన తండ్రి మరణానికి సంబంధించిన అధికారిక సమాచారం తనకు ఇంతవరకూ అందలేదని.. టీవీ చానళ్ల ద్వారానే తెలుసుకున్నట్లు చెప్పారు. మారుతిరావు మరణాన్ని అనుమానాస్పద మరణంగా పోలీసులు చెబుతున్నారు.
ప్రణయ్ హత్య తర్వాత నుంచి తన తండ్రి తనతో టచ్ లో లేరన్న ఆమె.. ప్రణయ్ ను చంపిన పశ్చాత్తాపంతోనే ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చన్నారు. ఇదిలా ఉంటే.. మారుతిరావు ఆత్మహత్య నేపథ్యంలో అమృత ఉంటున్న ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసుల్ని మొహరించి.. భద్రత కల్పించారు. ఇదిలా ఉంటే.. మారుతిరావు ఆత్మహత్య ఉదంతం గురించి తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు.. బంధువులు పెద్ద ఎత్తున ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రికి వచ్చిన మారుతిరావు సతీమణి గిరిజ.. అచేతనంగా ఉన్న భర్తను చూసినంతనే కింద పడిపోయారు. ప్రస్తుతం ఆమె కోలుకున్నారు. ఆమె రోదిస్తున్న తీరు అక్కడి వారికి కదిలించి వేస్తోంది.