'విరాట్' విలాస జీవితం చూస్తే కళ్లు తిరుగుతాయి..

Update: 2021-08-25 17:30 GMT
ఇండియన్ క్రికెట్ కెప్టెన్ కోహ్లి అంటే ఉరకలేత్తే ఉత్సాహానికి మారుపేరు. ఆయన ఆట చూడడానికి వేరే పనులు పక్కనబెట్టి మరీ టీవీ ముందుకు ఫ్యాన్స్ పరుగెత్తుకు వస్తారు. కోహ్లీ కెప్టెన్సీ కన్నా బ్యాటింగ్ టైమొస్తే చాలు క్రీడా ఫ్యాన్స్ సంబరపడిపోతారు. విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఐసీసీ ర్యాంకు ప్రకారం టాప్ టెన్లో కొనసాగుతున్నాడు. ప్రతీ ఆటలో వ్యక్తిగతంగా తన ఫర్ఫామెన్స్ చూపుతూ విశ్వవిజేత క్రికెటర్ గా పేరు తెచ్చుకుంటున్నాడు. ఇలా సక్సెస్ ఫుల్ లైఫ్ సాగడానికి కోహ్లీ కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటిస్తాడు. నాణ్యమైన ఫుడ్ ను తీసుకుంటాడు. కలుషితం లేని నీరు తీసుకుంటాడు. ఆయన తాగే నీరు ఫ్రాన్స్ నుంచి ఇంప్టోర్ట్ చేసుకుంటాడంటే ఎవ్వరూ నమ్మరు..

క్రికెట్ ఆడే సమయంలో ఆటగాళ్లు చేతిలో బాటిల్ తీసుకెళ్తుంటారు. ఎందుకంటే విదేశాల్లోని తాగునీరు కొందరికి పడకపోవచ్చు. అందుకని ప్రత్యేకంగా వాటర్ ను తమ బాటిల్ లో తెచ్చుకుంటారు. ఇటీవల కోహ్లి అలాగే ఓ బాటిల్ తో ప్రత్యక్షమయ్యాడు. మిగతా క్రికెటర్ల లాగే తాను కూడా తీసుకొచ్చాడు. అందులో వింతేమీ లేదు  అనుకోవచ్చు. కానీ ఆయన తాగే వాటర్ బాటిల్ విలువ అక్షరాల రూ. 3 వేల రూపాయలు.  ఈ నీటిని బ్లాక్ వాటర్ అంటారు. వీటిని ఫ్రాన్స్ నుంచి తెప్పించుకున్నాడట. ఫ్రాన్స్ లోని ఆల్ఫ్ష్ పర్వత శ్రేణి నుంచి పుట్టిన ఈ వాటర్ తాగడం వల్ల ఎంతో ఎనర్జీ అంటారు. అయితే ఈ బ్లాక్ వాటర్ ప్లాంట్ ఇప్పుడు గుజరాత్ లోకూడా ప్రారంభమైంది.

ఇక ఈ క్రికెటర్ విలాసవంతమైన జీవితం చూస్తే కళ్లు తిరుగుతాయి. కోహ్లీ ఏదీ కొన్నా హై రేంజ్లోనే ఉంటుంది. ఎక్కువ ధర ఉంటేనే కోహ్లీ కొనుగోలు చేస్తాడు.2020 లాక్డౌన్లో గురుగ్రామ్ లోని ఓ ఖరీదైన బంగ్లాలో జీవితం గడిపాడు. ఈ బంగ్లా ఇంటీరియర్, ఎక్స్ టీరియర్ డిజైన్ చేసే బాధ్యతను కన్ఫ్యూయన్స్ అనే సంస్థకు అప్పగించాడు. ఇలా చేసినందుకు ఆ కంపెనీకి కోహ్లి 80 కోట్ల రూపాయలు చెల్లించాడట. ముంబైలోని ఓ లగ్జరీ అపార్ట్ మెంట్ లోని 23 వ ఫ్లోర్ మొత్తం కొనేశాడట. 5 బెడ్ రూమ్స్ తో పాటు సముద్రం ఫేసింగ్ తో ఆకట్టుకుంటుంది. రిలాక్స్ గా ఉన్నప్పుడు ఈ ఇంట్లో గడుపుతాడట.

కోహ్లీ కార్ల విషయానికోస్తే కళ్లు తిరుగుతాయి. ఈయన అపార్ట్ మెంట్ లో కార్లకు ఓ ప్రత్యేక షెడ్డు వేశారట. ఇందులో బెంజ్, ఆడి, బెంట్లీ, రేంజ్ రోవర్ లాంటి ఖరీదైన కార్లు ఉన్నారు. అయన ఎప్పుడు ఎలాంటి కారు వాడాలనిపిస్తే అందులో వెళుతారట. ఇలా కోహ్లీ కార్ల కొనుగోలుకు రూ. 15 కోట్లు చెల్లించాడట. ప్రస్తుతం కోహ్లి కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్ కారు 5 కోట్ల రూపాయల ధర ఉంది.

కార్లతో పాటు ఈ క్రికెటర్ బైక్ లు కూడా తెగ వాడేస్తుంటాడు. మార్కెట్లో అత్యంత ఖరీదైన బైక్ ను మాత్రమే కొనుగోలు చేస్తాడు. సందర్భాన్ని భట్టి వాహనాన్ని వాడుతూ విలాసంగా గడుపుతాడట. విరాట్ హ్యాండ్ వాచ్ లకు లెక్కేలేదు. ఆయన దగ్గర పదుల సంఖ్యలో బ్రాండెడ్ వాచ్లు ఉన్నాయి.

కోహ్లి ఇంత విలాసం జీవితం గడపడానికి అయనకు వస్తున్న ఆదాయమే కారణం. బీసీసీఐ ఏడాదికి 5 కోట్లు చెల్లిస్తుంది. ఐపీఎల్ లో సీజన్ ను భట్టి రూ. 17 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఐపీఎల్ నుంచి కోహ్లీ అందుకున్న మొత్తం రూ. 140 కోట్లు. ఇక బ్రాండ్స్ రూపంలో రూ. 10 కోట్ల వరకు వస్తుంది. ఇలా మొత్తంగా కోహ్లి సంపాదన 980 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. క్రికెట్లలో అత్యంత విలాసంగా గడిపేది విరాట్ కోహ్లీనే అని చాలా మంది అంటున్నారు.
Tags:    

Similar News