అయ్యయ్యో : సోఫాలో కూర్చుంటూ కిందపడ్డ అచ్చెన్నాయుడు !

Update: 2021-10-13 08:49 GMT
ఏపీలోని శ్రీకాకుళంలోనేడు ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. స‌ర్దార్ గౌతు ల‌చ్చ‌న్న పోస్ట‌ల్ కవ‌ర్ ఆవిష్క‌ర‌ణ కోసం ఏర్పాటు చేసిన వేదిక మీద సోఫాలో కూర్చుంటున్న స‌మ‌యంలో ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, టెక్క‌లి ఎమ్మెల్యే కింజ‌రాపు అచ్చెన్నాయుడు, ఆయ‌న సోద‌రుడి కుమారుడు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు వెన‌క్కి వాలి ప‌డిపోయారు. భార‌త త‌పాలా శాఖ‌, ఓ ఎన్నారై సంస్థ సంయుక్తంగా నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మంలో చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న‌తో ఆయా కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి ఎంత జాగ్ర‌త్త తీసుకోవాల‌న్న విష‌యాన్ని మ‌రోమారు గుర్తు చేసిన‌ట్టైంది.

అచ్చెన్న‌తో పాటు రామ్మోహ‌న్ కూడా కూర్చున్న సోఫాతో పాటేన వెన‌క్కి ప‌డిపోయిన వైనం నిజంగానే క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేసిందని చెప్పాలి. 75 సంవ‌త్స‌రాల స్వ‌తంత్ర భార‌త ఆజాదీ అమృత మ‌హోత్సవం, జాతీయ త‌పాలా బిళ్ల‌ల సేక‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా బుధ‌వారం శ్రీకాకుళంలో భార‌త త‌పాలా శాఖ‌, ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్‌)మ సంయుక్తంగా ఓ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా స‌ర్దార్ గౌతు ల‌చ్చ‌న్న స్మార‌కార్థం పోస్ట‌ల్ క‌వ‌ర్‌ను ఆవిష్క‌రించేందుకు ఏర్పాట్లు చేశారు. స్థానిక ఎంపీ హోదాలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహ‌న్ నాయుడును ఆహ్వానించిన నిర్వాహ‌కులు, రాజ‌కీయాల్లో స‌త్తా చాటుతున్న బీసీ నేత హోదాలో ఏపీ అసెంబ్లీలో టీడీపీ డిప్యూటీ లీడ‌ర్‌గా కొన‌సాగుతున్న అచ్చెన్నాయుడిని కూడా ఆహ్వానించారు.

ఈ కార్య‌క్ర‌మానికి అచ్చెన్న కంటే కాస్తంత ముందుగానే వ‌చ్చిన రామ్మోహ‌న్ నాయుడు త‌న‌కు కేటాయించిన సోఫాలో ఓ వైపు చివ‌ర కూర్చున్నారు. ఇద్ద‌రేసీ కూర్చునేందుకు వీలుగా కుర్చీలు కాకుండా నిర్వాహ‌కులు సోఫాలను ఏర్పాటు చేశారు. రామ్మోహ‌న్ నాయుడు కూర్చున్న సోఫాలో రెండో చివ‌ర అచ్చెన్న‌కు చోటు కేటాయించారు. కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన అచ్చెన్న‌.. రామ్మోహ‌న్ కూర్చున్న సోఫాలో కూర్చున్నారు. ఆ వెంట‌నే ఆ సోఫా వెన‌క్కి తూలి ప‌డిపోయింది. సోఫాకు వెనుక భాగంలో స‌రిప‌డ ఆధారం లేని కారణంగానే ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. వెన‌క్కు తూలి ప‌డిపోయిన సోఫాతో పాటే అచ్చెన్న‌, రామ్మోహ‌న్ ప‌డిపోగా,వారి వెనుకే నిలుచున్న వారి సెక్యూరిటీ సిబ్బంది వారిద్ద‌రినీ లేపారు








Full View




Tags:    

Similar News