జ‌గ‌న్ మాట కోసం ఆశ‌గా చూస్తున్న మాజీలు!

Update: 2018-04-23 17:43 GMT
రాజ‌కీయాల్లో హ‌త్య‌లు ఉండ‌వు. ఆత్మ‌హ‌త్య‌లు మాత్ర‌మే ఉంటాయి. త‌మ ఉన్న‌తి కోసం.. త‌ను అత్యున్న‌త స్థానాల్లో కూర్చోబెట్టిన మ‌హానాయుడి ప‌ట్ల ప్ర‌ద‌ర్శించాల్సిన క‌నీస విధేయ‌త‌ను ప్ర‌ద‌ర్శించ‌టంలో కొంద‌రు కాంగ్రెస్ మాజీలు మర్చిపోవ‌టాన్ని ఇప్ప‌టికి మ‌ర్చిపోలేం. దివంగ‌త మ‌హానేత వైఎస్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఎంత‌మంది నేత‌ల‌కు పొలిటిక‌ల్ లైఫ్ ఇచ్చారో ఇప్ప‌టికి గుర్తుంచుకుంటారు.

మ‌హానేత మ‌ర‌ణించిన త‌ర్వాత వైఎస్ పుణ్య‌మా అని పైకి వ‌చ్చినోళ్లు చాలామంది త‌మ స్వార్థం చూసుకున్నారే త‌ప్పించి.. కనీసంగా ప్ర‌ద‌ర్శించాల్సిన విధేయ‌త‌ను ప్ర‌ద‌ర్శించింది లేదు. మ‌రికొంద‌రైతే ఏకంగా వైఎస్ స‌తీమ‌ణి విజ‌య‌మ్మ‌ను విమ‌ర్శించేంద‌కు సైతం వెనుకాడ‌లేదు.

ఏరు దాటాక తెప్ప త‌గ‌లేసిన చందంగా వ్య‌వ‌హ‌రించిన మాజీ కాంగ్రెస్ నేత‌ల ప‌రిస్థితి ఇప్పుడు ఇబ్బందిక‌రంగా ఉంది. ఒక‌ప్పుడు ఒక వెలుగు వెలిగిన నేత‌లంతా ఇప్పుడు బ్రేక్ కోసం త‌హ‌త‌హ‌లాడిపోయారు. స్వ‌ల్పకాల ప్ర‌యోజ‌నాల కోసం క‌క్కుర్తి ప‌డిన నేత‌ల్లో ప‌లువురు త‌మ‌కు ఎదురైన రాజ‌కీయ వైఫ‌ల్యాల నేప‌థ్యంలో.. పూర్వ‌వైభ‌వం కోసం వైఎస్ జ‌గ‌న్ వైపు ఆశ‌గా ఎదురుచూస్తున్నారు.

వైఎస్ తో ఉండి.. ఆయ‌న ఇమేజ్ తో ప‌ద‌వులు పొందిన ప‌లువురునేత‌లు త‌ర్వాతి కాలంలో వైఎస్సార్‌కాంగ్రెస్ లో చేరలేదు. విభ‌జ‌న నిర్ణ‌యం తీసుకున్న నేప‌థ్యంలో కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయారు. వేర్వేరు పార్టీల్లో చేరారు. అలాంటి వారంతా ఆయా పార్టీల్లో ఇమ‌డ‌లేని ప‌రిస్థితి.

నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి విష‌యానికే వ‌స్తే.. ఆయ‌న టీడీపీలో ఉన్న‌ప్ప‌టికీ బాబు పోక‌డ‌ల్ని ఆయ‌న జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఆయ‌న తీవ్ర ఇబ్బందుల‌కు గురి అవుతున్నారు. తన సోద‌రుడు అనారోగ్యంతో ఆసుప‌త్రిలో ఉంటే.. బాబు స్పందించిన తీరు ఇబ్బందిక‌రంగా ఉండ‌ట‌మే కాదు.. తీవ్ర అస‌హ‌నానికి గురైన‌ట్లు చెబుతారు.

వైఎస్ హ‌యాంలో ఒక వెలుగు వెలిగిన మ‌రో నేత క‌న్నాల‌క్ష్మీనారాయ‌ణ విష‌యాన్నే తీసుకుంటే.. విభ‌జ‌న నిర్ణ‌యం త‌ర్వాత కాంగ్రెస్ ను వ‌దిలేసి బీజేపీలో చేరారు. సంఘ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారికి త‌ప్పించి బీజేపీలో మ‌రే నేత‌కు పెద్ద‌గా అవ‌కాశం ఉంద‌న్న విష‌యాన్ని అర్థం చేసుకోవ‌టానికి ఆయ‌న‌కు కొంత స‌మ‌యం ప‌ట్టింది. రాజ‌కీయంగా తాను చేసిన త‌ప్పును గుర్తించిన ఆయ‌న ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్ర‌య‌త్నాలు షురూ చేశారు.

ఇలా ప‌లువురు కాంగ్రెస్ మాజీలు తాము చేరిన పార్టీల్లో ఉండ‌లేక‌.. త‌మ‌కు ఎంతో సుప‌రిచిత‌మైన జ‌గ‌న్ గూటికి చేరిపోవాల‌న్న ఆస‌క్తిని వ్య‌క్తం చేస్తున్నారు. అయితే.. పార్టీలో చేరిక‌ల విష‌యంలో వైఎస్ జ‌గ‌న్ ఆచితూచి అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అవ‌స‌రానికి వ‌స్తున్న నేత‌ల్లో ఎవ‌రిని చేర్చుకోవాలా? అన్న విష‌యం మీద తొంద‌ర‌ప‌డ‌కుండా ఆచితూచి నిర్ణ‌యం తీసుకోవాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు.. జ‌గ‌న్ మౌనం కాంగ్రెస్ మాజీల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మ‌రి.. ఇలాంటి నేత‌ల విష‌యంలో జ‌గ‌న్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.
Tags:    

Similar News