కృష్ణా - గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న తాగునీటి ప్రాజెక్టులు ఆపాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ అధినేత జగన్ జల దీక్ష చేపట్టడంపై తెలంగాణలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ నివాసం లోటస్ పాండ్ వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జగన్ దీక్షపై ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్నూలులో జగన్ చేస్తున్న దీక్షను నిరసిస్తూ ఓయూ విద్యార్థి జేఏసీ - తెలంగాణ నవనిర్మాణ విద్యార్థి సేన కార్యకర్తలు లోటస్ పాండ్ సమీపంలో వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులను అడ్డుకోవద్దని, దొంగ దీక్షలు మొదలు పెడితే తీవ్ర పరిణామాలుంటాయని వారు హెచ్చరించారు.
మరోవైపు జగన్ దీక్షపై బీజేపీ తెలంగాణ నేత నాగం జనార్దన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల కష్టాలను తీర్చేందుకు తలపెట్టిన ప్రాజెక్టులను అడ్డుకొని, తమను రెచ్చగొట్టొద్దంటూ హెచ్చరించారు. కృష్ణా జలాలు ఖమ్మం - మహబూబ్ నగర్ - నల్గొండ జిల్లాల రైతుల కష్టాలను తీరుస్తాయని, వాటిని ఉపయోగించుకోవడం అక్కడి ప్రజల హక్కని అన్నారు. తెలంగాణ ప్రజల హక్కులను హరించవద్దని, ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. డిండి ఎత్తిపోతల పథకానికి దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే జీవో ఇచ్చారని నాగం చెప్పారు.
కాగా జగన్ దీక్షపై ఏపీలోనూ విమర్శలు మొదలయ్యాయి. ముఖ్యంగా టీడీపీ నేతలు జగన్ పై విరుచుకుపడుతున్నారు. టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి అయితే తనదైన శైలిలో ‘‘జగన్! ఆప్ కీ ఖేల్ ఖతమ్...వెరీ సూన్ అబ్బయ్యా!’’ అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. జగన్ దీక్షను చూస్తుంటే తనకు చిరంజీవి సినిమాలోని 'జపం జపం జపం కొంగ జపం...తపం తపం తపం దొంగ తపం' పాట గుర్తుకొస్తోందని ఆయన చెప్పారు. జగన్ కు బలిసి దీక్షలు చేస్తున్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరో టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు కూడా జగన్ దీక్షపై మండిపడ్డారు. ఆయన ఇప్పుడు ఎందుకు దీక్ష చేస్తున్నారో అర్థం కావడం లేదని.. తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేసిందని.. జగన్ కర్నూలులో దీక్ష చేయడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. మొత్తానికి జగన్ దీక్ష వల్ల అటు తెలంగాణ, ఇటు ఏపీలో ఒక్కసారిగా వేడిపెరిగినట్లయింది.