బాబు కలెక్షన్‌ ఏజెంటు నారాయణ అంట?

Update: 2015-03-20 09:42 GMT
ఏపీ అసెంబ్లీలో ఒక్కస్థానం లేని సీమాంధ్ర కాంగ్రెస్‌ పార్టీ నిరుత్సాహంలో మునిగిపోకుండా.. పోయిన చోట వెతుక్కునే ధోరణిని ప్రదర్శిస్తోంది. ఏ విభజన కారణంగా తమ పార్టీ ఏపీలో నష్టపోయిందో.. అదే ఏపీలో విభజన మీద రచ్చ రచ్చ చేసి సీమాంధ్రుల మనసుల్ని దోచుకోవాలని భావిస్తోంది.

విభజన సందర్భంగా ఏపీకి ఇచ్చిన హామీల అమలుపై ఓ రేంజ్‌లో ఉద్యమం చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ.. తాజాగా ఏపీ అధికారపక్షంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై  సీనియర్‌ కాంగ్రెస్‌ నేత ఆనం వివేకానంద రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీ రాజధాని పేరిట చంద్రబాబు బిజినెస్‌ చేస్తున్నారని.. ఆయనకు కలెక్షన్‌ ఏజెంటుగా మంత్రి నారాయణ వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

ఇచ్చిన హామీల్ని నెరవేర్చే క్రమంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రస్తావించే ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రత్యేక విమానాల్లో ప్రయాణిస్తు విపరీతంగా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. స్వర్ణాంధ్రను చేస్తానని చెబుతున్న చంద్రబాబు..ఏపీని శూన్యాంధ్రగా మారుస్తున్నారన్నారు. తాజాగా ఆనం వారు చేసిన ఆరోపణలపై ఏపీ అధికార పక్షం ఎలా రియాక్ట్‌ అవుతుందో..?

Tags:    

Similar News