శిలువ‌తో సీన్‌ లోకి వ‌చ్చిన టీడీపీ నేత

Update: 2016-03-25 10:05 GMT
ఆనం వివేకానందరెడ్డి...నెల్లూరుకు చెందిన టీడీపీ నేత‌. సీనియ‌ర్ రాజ‌కీయ నాయకుడు అయిన ఆనం వ్య‌వ‌హార‌శైలి భ‌లే ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. తాజాగా గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆనం వివేకా శిలువను మోసి ఏసుక్రీస్తుపై తన భక్తిని చాటుకున్నారు. ఫతేఖాన్ పేటలోని పునీత్ ఆంథోనీ చర్చ్ కి ఏసుక్రీస్తు వేషధారణలో వచ్చిన ఆనం, ప్రత్యేక ప్రార్థనల అనంతరం శిలువను భుజానికి ఎత్తుకుని వీధుల్లో నడిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు సర్వమతాలూ ఒక్కటేనని అన్నారు. నెల్లూరులో గత 17సంవత్సరాలుగా ఇదే చర్చి వద్ద తాను శిలువను మోస్తున్నానని చెప్పారు. తాను అనుకున్నది.. కోరుకున్నది ప్రభువు చేస్తున్నాడని, తన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందని తెలిపారు.

ఈ శిలువ మోసే క్ర‌మంలో ఆనం మ‌రింత క్రేజీగా బిహేవ్ చేశారు. ఆంథోనీ చర్చ్‌ లో శిలువ మోసేందుకు వ‌చ్చిన ఆనం వివేకాకు శిలువను అందించేందుకు కొంత సమయం పట్టింది. ఆ గ్యాప్‌ లో ఆనం ఛాయ్ తాగి దమ్ముకొట్టారు. దీంతో ఆనం హల్‌ చల్ చూసి జనం నోరెళ్ల బెట్టారు. అయిన‌ప్ప‌టికీ ఆనం వివేకా త‌న‌ప‌ని తాను చేసుకుంటూ పోయారు.
Tags:    

Similar News