నకిలీ బ్రాండ్ పై ఆనంద్ మహీంద్రా ఫన్నీ ట్వీట్.. వైరల్..!

Update: 2022-11-23 09:35 GMT
వస్తువు ఒకటే గానీ తయారు చేసే విధానం వేరుగా ఉంటుంది. కొన్ని కంపెనీలు నాణ్యతకు పెద్దపీట వేస్తే.. మరికొన్ని కంపెనీలు నాణ్యతను పక్కన పెట్టి తక్కువ ధరకు వస్తువులు అందించేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఈ నేపథ్యంలో తయారీ రంగంలో బ్రాండ్.. నాన్ బ్రాండ్ అనే వ్యత్యాసం ఏర్పడింది.

అయితే వినియోగదారులు తమ శక్తి మేరకు నాణ్యమైన వస్తువులు కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతుంటారు. ఒకప్పుడు బ్రాండెండ్ వస్తువులను సెలబ్రెటీలు.. ధనవంతులు మాత్రమే కొనుగోలు చేసేవారు. అయితే ఈ కల్చర్ ఇటీవల కాలంలో మధ్యతరగతి వారికి కూడా పాకింది. దీంతో బ్రాండెండ్ వస్తువులను ఫుల్ డిమాండ్ ఏర్పడింది.

ఈ నేపథ్యంలో మార్కెట్లోకి నకిలీ బ్రాండ్లు సైతం ఎన్నో పుట్టుకొస్తున్నాయి. ఒకే ఒక అక్షరం తేడాతో కంపెనీల పేర్లు ఉండటం.. ఒకే తరహా లోగో ఉండటంతో చాలామంది వీటిని గుర్తించడంలో పొరపాటు పడుతున్నారు. అసలును నకిలీని పోల్చుకోలేనంత తేడాతో మార్కెట్లోకి ప్రముఖ కంపెనీల వస్తువులు వస్తూ వినియోగదారులను బురిడీ కొట్టిస్తున్నాయి.

ఊదహరణకు Panasonic అనేది ఒరిజినల్ కంపెనీ.. కానీ కొందరు Panasonik అని రాసి ఆ కంపెనీ వస్తువులను మార్కెట్లో విరివిగా విక్రయిస్తున్నారు. ఇందులో ఒకే ఒక అక్షరం తేడా ఉంది. కొనుగోలు చేసే సమయంలో దీనిని గమనించకుంటే మాత్రం అసలు బ్రాండ్ కు బదులుగా నకిలీని ఇంటికి తీసుకెళ్లాల్సి వస్తుంది. ఆ తర్వాత గుర్తించిన పెద్దగా ఫలితం ఉండదు.

తాజాగా ఆనంద్ మహీంద్ర నకిలీ బ్రాండ్ పై వినియోగదారులను అప్రమత్తం చేసేలా ఓ ట్వీట్ చేశారు. ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్ అడిడాస్ ను పోలివున్న నకిలీ బ్రాండ్ ఫొటోను ఆనంద్ మహేంద్ర తన ట్వీటర్లో పోస్టు చేశారు. ఈ షూస్ అచ్చం అడిదాస్ కంపెనీ షూకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఉంది. అయితే పేరు మాత్రం అజిత్ దాస్ అని ఉంది.

ఈ ఫొటోకు ఆనంద్ మహేంద్ర ''ఈ లాజిక్ కరెక్టే.. ఆడికి అజిత్ అనే సోదరుడు ఉన్నాడేమోనని అన్పిస్తోంది.. వసుధైక కుటుంబం..?'' అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు. దీనిని చూసిన నెటిజన్లు సైతం తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. దీంతో ఈ ట్వీట్ కాస్తా నెట్టింట్లో వైరల్ గా మారింది. ఏది ఏమైనా నకిలీ బ్రాండ్ అని తెలిసి తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ప్రాబ్లం ఉండదు కానీ ధర ఎక్కువైతేనే తర్వాత బాధపడాల్సి వస్తుంది. సో బీ కేర్ ఫుల్ ..



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News